సుదీర్ఘమైన ముద్దు రికార్డును థాయ్‌లాండ్‌(Thailand)కు చెందిన ఓ జంట సాధించింది. పదేళ్ల కిందట అంటే 2013 ఫిబ్రవరిలో వారు ఏకంగా 58 గంటల 35 నిమిషాల పాటు ముద్దు పెట్టుకుని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌(Guinness World Records)లోకి ఎక్కారు. ఇప్పుడీ రికార్డును ఏ జంటా బద్దలు కొట్టలేదు. ఎందుకంటే ఈ సుదీర్ఘమైన ముద్దుల పోటీలను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇకపై నిర్వహించకూడదని నిర్ణయించుకుంది. ఈ పోటీ చాలా ప్రమాదకరంగా మారడమే దీనికి కారణమట!

సుదీర్ఘమైన ముద్దు రికార్డును థాయ్‌లాండ్‌(Thailand)కు చెందిన ఓ జంట సాధించింది. పదేళ్ల కిందట అంటే 2013 ఫిబ్రవరిలో వారు ఏకంగా 58 గంటల 35 నిమిషాల పాటు ముద్దు పెట్టుకుని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌(Guinness World Records)లోకి ఎక్కారు. ఇప్పుడీ రికార్డును ఏ జంటా బద్దలు కొట్టలేదు. ఎందుకంటే ఈ సుదీర్ఘమైన ముద్దుల పోటీలను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇకపై నిర్వహించకూడదని నిర్ణయించుకుంది. ఈ పోటీ చాలా ప్రమాదకరంగా మారడమే దీనికి కారణమట! అదేమిటి ముద్దు ప్రమాదకరమని చెబుతారేమిటి? అంటారా? ఈ రికార్డుకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి. అవే కష్టంగా ఉంటాయి మరి! పోటీలో పాల్గొనే ఇద్దరి పెదవులు ఎప్పుడూ తాకుతూనే ఉండాలి. బ్రేక్‌ తీసుకోడానికి అనుమతి లేనే లేదు. నిలబడే ఉండాలి. సదా మెలకువతో ఉండాలి. ఎంచక్కా ముద్దు పెట్టేసుకుందామనుకునే జంటలకు ఇవన్నీ కష్టమే కదా! పాత రికార్డును బద్దలు కొట్టాలనే తలంపుతో లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారట! చాలా మంది నిద్రలేమి సంబందిత మనోవ్యాధుల బారిన పడుతున్నారని గిన్నిస్‌ వారు గుర్తించారు. వీటిని దృష్టిలో పెట్టుకునే సుదీర్ఘ ముద్దు పోటీని సుదీర్ఘ ముద్దు మారథాన్‌ (Longest Kissing Marathon)గా మార్చింది. ఇందులో అంత కఠినతరమైన నిబంధనలు లేవు. ప్రతి గంటకు అయిదు నిమిషాల బ్రేక్‌ తీసుకోవచ్చు. బానే ఉంది కానీ ఇప్పటి వరకు ఇందులో ఎవరూ రికార్డు సృష్టించలేదట!

Updated On 7 July 2023 6:48 AM GMT
Ehatv

Ehatv

Next Story