Ohio Sex Worker : హెచ్‌ఐవీ ఉందని తెలిసి 200 మందితో 'ఆ పని' చేసిన ఓ సెక్స్ వర్కర్
అమెరికాలో(America) ఓ సెక్స్ వర్కర్(Sex Worker) తీరుతో వందలాది మంది ఆందోళన చెందుతున్నారు. తనతో సెక్స్‌లో పాల్గొన్న వందలాది మంది ఇప్పుడు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. విషయ ఏంటంటే తనకు హెచ్‌ఐవీ(HIV) పాజిటివ్ అని తెలిసినా అనేక మందితో లైంగిక సంబంధం(Sexual intercourse) కొనసాగించింది. ఈ విషయం తెలిసి అధికారులు షాక్ తిన్నారు.
అమెరికాలో(America) ఓ సెక్స్ వర్కర్(Sex Worker) తీరుతో వందలాది మంది ఆందోళన చెందుతున్నారు. తనతో సెక్స్‌లో పాల్గొన్న వందలాది మంది ఇప్పుడు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. విషయ ఏంటంటే తనకు హెచ్‌ఐవీ(HIV) పాజిటివ్ అని తెలిసినా అనేక మందితో లైంగిక సంబంధం(Sexual intercourse) కొనసాగించింది. ఈ విషయం తెలిసి అధికారులు షాక్ తిన్నారు. దీంతో స్థానికులను అప్రమత్తం చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ హెల్త్ అలర్ట్(Health Alert) జారీ చేశారు. సదరు సెక్స్ వర్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికాలోని ఒహైయో(Ohio) రాష్ట్రంలో మరియెట్టాకు చెందిన లిండా లెచెసే(Linda Lechesi) అనే ఓ సెక్స్ వర్కర్ అక్కడి మార్కెట్ వీధిలో ఎంతో మందిని ఆకర్షించేది. 2022 జనవరి నుంచి ఇప్పటివరకు పలువురితో లైంగిక సంబంధం నెరిపింది. ఇదే సమయంలో ఆమె హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అయినా సరే లిండా తన లైంగిక కార్యకలాపాలను కొనసాగించింది. రెండున్నరేళ్లలో దాదాపు 211 మందితో రాసలీలల్లో తేలినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు బహిరంగా హెల్త్ అలర్ట్ జారీ చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారంతా హెల్త్ చెకప్ చేసుకోవాలని సూచించారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న క్లయింట్లకు స్వయంగా అధికారులే ఫోన్ చేసి వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుతున్నారు.