అగ్రరాజ్యం అమెరికాలో(America) మళ్లీ తుపాకీ(Gun) విరుచుకుపడింది. లెవిస్టన్‌(Levistan), మైనే ప్రాంతాలలో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 22 మంది చనిపోయారు. దాదాపు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బుధవారం ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తాజగా అనుమానితుడి రెండు ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.

అగ్రరాజ్యం అమెరికాలో(America) మళ్లీ తుపాకీ(Gun) విరుచుకుపడింది. లెవిస్టన్‌(Lewiston), మైనే ప్రాంతాలలో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 22 మంది చనిపోయారు. దాదాపు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బుధవారం ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తాజగా అనుమానితుడి రెండు ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. నిందితుడు ఉపయోగించిన నల్ల వాహనం కోసం లూయిస్టన్‌లో(Lewiston) వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. దుండగుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను పోలీసులుకోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి, గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నాడు.క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. లెవిస్టన్.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల దూరంలో ఉంది. తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ కార్యాలయం ప్రకటించింది. స్థానికులు తాత్కాలికంగా ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించారు.

Updated On 26 Oct 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story