Texas Plane-Car Crash Accident : అమెరికాలో వింత ప్రమాదం చోటు చేసుకొంది.
అమెరికాలో వింత ప్రమాదం చోటు చేసుకొంది. రోడ్డుపై వెళ్తున్న కారును(Car) ఓ విమానం(airplane) ఢీకొట్టింది. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నామా.. ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఈ ఘటన అమెరికా టెక్సాస్(Texas) రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో(McKinney) జరిగింది
అమెరికాలో వింత ప్రమాదం చోటు చేసుకొంది. రోడ్డుపై వెళ్తున్న కారును(Car) ఓ విమానం(airplane) ఢీకొట్టింది. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నామా.. ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఈ ఘటన అమెరికా టెక్సాస్(Texas) రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో(McKinney) జరిగింది
శనివారం మధ్యాహ్నం ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో(Arrow County Airport) ఓ చిన్న లాన్సర్ Iv-P(Lancer Iv-P) ప్రాప్‌జెట్ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్ అయింది. ఆ విమానంలో ఏదో లోపం తలెత్తడంతో పైలట్ దానిని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేద్దామని అనుకున్నాడు. రన్‌వేపై(Runway) విమానం ఆగలేదు. రన్‌వే చివరి వరకూ వెళ్లినా అది ఆగలేదు. అక్కడే ఉన్న కంచెను దాటేస్తూ రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొంది. వెంటనే ఎమర్జెన్సీ బృందాలు స్పాట్‌కు చేరుకున్నాయి. పైలట్, ప్రయాణికుడు, కారు డ్రైవర్‌ను సహాయక బృందాలు రక్షించాయి. ఇందులో ఒకరికి స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ(Federal Aviation Authority) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డును కొంత సమయం బ్లాక్ చేసి సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికాలో గత కొంత కాలంగా ఇలాంటి విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. అమెరికాలో 2019లో 988 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 307 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లోనూ ఈ ప్రమాదాల సంఖ్య 939 ఉండగా.. 268 మంది ఈ ప్రమాదాల్లో మృతి చెందారు. రన్ వే దిగే సమయాల్లో విమానాల వేగంపై అదుపులేక పోవడమే ప్రమాదాలకు ముఖ్య కారణమని భావిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్, ఎక్స్‌పీరియన్స్ పైలట్లు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉందని..ఏడాదికి వంద గంటల కన్నా తక్కువగా విమానాలు నడిపేవారి వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయిని అంచనా వేస్తున్నారు అధికారులు.