ఢిల్లీలోనే(Delhi) కాదు, పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన లాహోర్‌(Lahore) నగరంలోనూ కాలుష్యం(Pollution) ఎక్కువయ్యింది.

ఢిల్లీలోనే(Delhi) కాదు, పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన లాహోర్‌(Lahore) నగరంలోనూ కాలుష్యం(Pollution) ఎక్కువయ్యింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారిపోయింది. నగరమంతా నల్లటి విషపు పొగలు వ్యాపించాయి. అక్కడ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(Air quality Index) 1900 దాటింది. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇంట్లో ఉన్నా అదే పరిస్థితి. ఇప్పటికే 15 వేల మంది ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆసుపత్రులలో చేరారు. కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి భయంకరంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలుష్యానికి ప్రధాన కారణాలను గుర్తించి వాటిని పూర్తిగా నియంత్రించాలని చెబుతున్నారు. ప్రైవేటు వాహనాలను తగ్గించాలని సూచిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story