బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో(Britain Parliament elections) లేబర్‌ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించబోతున్నది.

బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో(Britain Parliament elections) లేబర్‌ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించబోతున్నది. 650 సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 సీట్లు వస్తే చాలు. ఈ మ్యాజిక్‌ ఫిగర్‌ను లేబర్‌ పార్టీ సునాయాసంగా దాటేసింది. లేబర్‌పార్టీకి చెందిన నాయకుడు కీర్‌ స్టార్మర్‌(Keir Starmer) ప్రధానమంత్రిగా(Prime minister) బాధ్యతలు చేపట్టడమే తరువాయి! మాజీ మానవ హక్కుల న్యాయవాది అయిన 61 ఏళ్ల కీర్‌ స్టార్మర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కూడా ఉన్నారు. సంగీతంలో దిట్ట. పార్ల‌మెంట్‌కు ఎన్నికైన తొమ్మిదేళ్ల‌లోనే ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి చేప‌డుతుండటం గమనార్హం. 1962, సెప్టెంబర్‌ 2వ తేదీన జన్మించిన కీర్‌ స్టార్మర్‌కు ముగ్గరు తోబుట్టువులు. లండన్‌(London) శివార్లలో ఓ ఇరుకైన ఇంట్లో కీర్‌ బాల్యం గడిచింది. లీడ్స్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించిన కీర్‌ తర్వాత మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. లేబర్ పార్టీ నాయకుడు గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితుడ‌య్యాడు. ఆ పదవిని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించారు. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ఈయనకు నైట్‌ ర్యాంక్‌ బిరుదు ఇచ్చారు. 50 ఏళ్ల వయసులో కీర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. స్టార్మర్‌ భార్య విక్టోరియా నేషనల్‌ హెల్త్‌ సర్వీసులో ఆక్యుపేషనల్ థెరపిస్టుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. శని, ఆదివారాలను పూర్తిగా తన కుటుంబానికే కేటాయిస్తారు కీర్‌ స్టార్మర్‌. మరోవైపు రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు ముగింపు పలికారు.

Eha Tv

Eha Tv

Next Story