Spain La Tomatina Celebrations : స్పెయిన్‌లో హుషారుగా జరిగిన లా టొమాటినా వేడుక!
బుధవారం రోజున స్పెయిన్‌లో(Spain) లా టొమాటినా(Tomatina) వేడుక జరిగింది. పేరును బట్టి ఉత్సవమేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే వేడుకలో పాల్గొన్నట్టుగానే ఈసారి కూడా వేలాది మంది పాల్గొన్నారు. ఇంతకు అయిదింతల పర్యాటకులు ఆ వేడుకను చూసేందుకు వచ్చారు. లా టొమాటినా అంటే ఏం లేదండి.. టమాట గుజ్జుతో(Tomato Juice) హోలీ అడుకోవడమంతే! అదేం సరదానో! ఓ వారం రోజుల కిందట ఇదే ఫెస్టివల్‌ను చూసుంటే మన గుండెలాగిపోయేవి.. అంతంత రేట్లు పెట్టేసి వాటిని పాడు చేస్తుంటే ఎవరికి మాత్రం నొప్పిగా ఉండదు చెప్పడి.
బుధవారం రోజున స్పెయిన్‌లో(Spain) లా టొమాటినా(La Tomatina) వేడుక జరిగింది. పేరును బట్టి ఉత్సవమేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే వేడుకలో పాల్గొన్నట్టుగానే ఈసారి కూడా వేలాది మంది పాల్గొన్నారు. ఇంతకు అయిదింతల పర్యాటకులు ఆ వేడుకను చూసేందుకు వచ్చారు. లా టొమాటినా అంటే ఏం లేదండి.. టమాట గుజ్జుతో(Tomato Juice) హోలీ అడుకోవడమంతే! అదేం సరదానో! ఓ వారం రోజుల కిందట ఇదే ఫెస్టివల్‌ను చూసుంటే మన గుండెలాగిపోయేవి.. అంతంత రేట్లు పెట్టేసి వాటిని పాడు చేస్తుంటే ఎవరికి మాత్రం నొప్పిగా ఉండదు చెప్పడి.
అసలు గిట్టుబాటు ధర లేక మన రైతులు పండించిన టమాటాలను రోడ్ల మీద పారేసి వెళ్లినప్పుడే ప్రాణం ఊసూరుమంటుంది మనకు! అలాంటిది టన్నుల కద్దీ టమాటాలను గుజ్జు చేసి జనం మునిగితేలుతుంటే అయ్యో అనిపిస్తుంది. అయినా ఎవరి సరదా వారిది! మన మనోభావాలను పక్కన పెడితే వేడుక మాత్రం కలర్‌ఫుల్‌గా సాగింది. ఎప్పటిలాగే స్పెయిన్ వీధులన్నీ ఎర్రగా మారాయి. ఒకరిపై ఒకరు టమాటా గుజ్జును చల్లుకుంటూ మస్తుగా ఎంజాయ్ చేశారు. టమాటా జ్యూస్‌లో మునిగిపోయారు.
అసలు టమాటాలతో కొట్టుకునే ఈ పోరును చూసేందుకే బోల్డంత మంది పర్యాటకులు స్పెయిన్‌కు వెళుతుంటారు.
ఈ వేడుక కోసం వందలాది ట్రక్కుల టమాటాలను వాడేస్తారు. సుమారు పాతికవేల మంది ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటారు. సారీ.. పాలు కాదు టమాటా జ్యూస్ పంచుకుంటారు. షరా మామూలుగా స్పెయిన్‌లోని వాలిన్‌సియా నగరం దగ్గర ఉన్న బునోల్ గ్రామంలో ఈ వేడుకలు జరిగాయి. టమాటాలతో కొట్టేసుకున్నారు. అదో సంస్కృతి. సుమారు ఎనిమిది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం ఇది! ప్రతి ఏడాది ఆగస్టు నెల చివరి బుధవారం రోజున ఈ ఉత్సవం జరుగుతుందన్న మాట! ఓ గంటపాటు ఈ సరదా ఆట సాగుతుంది.
బునోల్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా టమాటాలతో కొట్టుకునేందుకు వచ్చారు. అన్నట్టు టమాటలతో కొట్టేసుకుంటే దెబ్బలు తగులుతాయి కాబట్టి టమాటలను నలిపి విసిరాలనే నిబంధన పెట్టింది స్థానిక మునిసిపాలిటీ. అసలు ఈ ఉత్సవం ఆవిర్భావమే చాలా గమ్మత్తుగా జరిగింది. ఆగస్టు నెల చివరి బుధవారం నాడు అక్కడి సంప్రదాయం ప్రకారం జెయింట్స్ అండ్ బిగ్‌హెడ్స్ పరేడ్ జరుగుతుంది.
ఈ పరేడ్‌లో చాలామంది యువకులు పాల్గొన్నారట! తొక్కిసలాటలో ఓ యువకుడు కిందపడ్డాడట! పడటం పడటంతోనే అతగాడు కోపంతో కనిపించిందల్లా చేతిలో తీసుకుని జనం మీదకు విసరడం మొదలుపెట్టాడట! అప్పుడే ఆ దారంట ఓ టమాటా బండి వెళ్లిందట! అతడు ఆ టమాటాలు కూడా తీసుకుని విసరసాగాడట! అవతలివాళ్లు ఊరుకుంటారా? వాళ్లూ టమాటాలు తీసుకుని విసిరారట! అలా చాలాసేపు విసురుకున్నాక పోలీసులు వచ్చి నిలువరించారట!ఆ మరుసటి ఏడాది కొందరు యువకులు అక్కడికి వచ్చి సరదాగా గొడవపడ్డారట! ముందుగా అనుకున్న ప్రకారం ఇంటినుంచి టమాటాలు తెచ్చుకుని ఒకరిపై ఒకరు విసురుకున్నారట!
అప్పుడు కూడా పోలీసులు వచ్చి ఉత్తుత్తి గొడవే అయినా దాన్ని ఆపించారట! అలా ప్రతి ఏడూ యువకులు ఆ ప్రాంతానికి రావడం, టమాటాలతో కొట్టుకోవడం రివాజుగా మారింది. 1950, 1975లలో అటు పోలీసులు, ఇటు మునిసిపాలిటీ అధికారులు లా టమోటినాను నిషేధించారు. అయినా యువత మాత్రం లెక్కచేయలేదు. ఎలాగోలా అక్కడికి వచ్చి టమాటాలు విసురుకుంది. దాంతో అధికారులు ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. కొన్ని షరతులతో కూడిన ఉత్సవానికి అనుమతి ఇచ్చారు. క్రమంగా పర్యాటకుల సంఖ్య పెరగడంతో లా టమోటినా కాస్తా అధికారిక వేడుకగా మారింది.
ఈ వేడుక పాపులర్ కావడంతో ప్రత్యేకంగా దీని కోసమే టమాటాలను అధికంగా పండించడం మొదలుపెట్టారు రైతులు. అన్నట్లు ఈ వేడుకలో వాడే టమాటాలు అంత రుచికరంగా ఉండవట! కేవలం కొట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయట! టమాటాలను వేస్టు చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలను తప్పించుకోవడానికే ఇలా చెబుతున్నారేమో తెలియదు. ఒకప్పుడు ఎవరి ఇంటినుంచి వాళ్లు టమాటాలను తెచ్చుకునేవారు.
ఇప్పుడు మాత్రం స్థానిక మునిసిపాలిటీనే టమాటాలను ట్రక్కులలో సరఫరా చేస్తోంది. టమాటాలను సప్లయ్ చేయడం ఒక ఎత్తు అయితే వేడుక అయ్యాక నగరాన్ని క్లీన్ చేసుకోవడం మరో ఎత్తు! లా టమోటినాను ఇప్పుడు అధికార యంత్రాంగమే నిర్వహిస్తోంది. టమాటాలతో కొట్టుకోవడానికి ముందు గ్రీజు పూసిన ఓ స్తంభంపైన ఆహారపదార్థాలను ఉంచుతారు. ఆ స్తంభాన్ని ఎక్కి ఆ ఆహారపదార్దాలను తీసుకోవడానికి యువకులు ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరు ఇందులో విజయం సాధిస్తారు. అప్పుడు పోలీసులు సైరన్ మోగిస్తారు.
ఆ సైరన్ తర్వాతే టమాటాల పోరు మొదలవుతుంది. ఓ గంట పాటు అలా టమాటాలతో యుద్ధంచేస్తుంది యువత! ఆ తర్వాత మళ్లీ సైరన్ మోగుతుంది. అప్పుడు పోరును ఆపేయాలి! స్పెయిన్ టమాట ఫెస్టివల్‌ను చూసిన తర్వాత చాలా దేశాలు ఈ వేడుకను అనుకరించడం మొదలు పెట్టాయి. దక్షిణ కొరియాలో కూడా ఈ వేడుక పాపులరయ్యింది.. ప్రతి ఏడాది గ్వాంగ్జు టీకోన్ అనే పట్టణంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.. ఈ ఫెస్టివల్‌లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొంటారు. టమాటా యుద్ధం.. టమాటా డాన్సింగ్, టమాటా సాకర్ వంటి ఆటలు కూడా ఆడతారు.. ఇటీవలి కాలంలో మన దగ్గర కూడా టమాటా ఫెస్టివల్ మొదలయ్యింది..