North Korea : కవ్విస్తే ఖతం చేస్తా...అమెరికా, దక్షిణ కొరియాలకు కిమ్ అల్టిమేటం!
ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశాలు కనుక కవ్వింపులకు దిగితే వాటిని సర్వ నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపునిచ్చారు కిమ్(Kim). ఇకపై దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని స్పష్టం చేశారు. 'నిజానిజాలు గుర్తించి దక్షిణ కొరియాతో(South korea) మా సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశాలు కనుక కవ్వింపులకు దిగితే వాటిని సర్వ నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపునిచ్చారు కిమ్(Kim). ఇకపై దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని స్పష్టం చేశారు. 'నిజానిజాలు గుర్తించి దక్షిణ కొరియాతో(South korea) మా సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ అమెరికా, దక్షిణ కొరియా సైనిక(Military ) ఘర్షణకు ప్రయత్నిస్తే మాత్రం మా దగ్గర ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోము. మా దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటంచి, మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం కోసం చూస్తున్న ప్రజలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించము' అని కిమ్ పేర్కొన్నారు. ఒకప్పుడు అవిభాజ్య కొరియాగా ఉన్న దేశం 1953 సైనిక ఘర్షణ తర్వాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. కానీ ఎలాంటి యుద్ధ విరమణ ప్రకటన రాలేదు. టెక్నికల్‌గా(Technical) రెండు దేశాల మధ్య యుద్ధం(War) జరుగుతున్నట్టేనన్నమాట! రెండు దేశాలు ఎప్పటిఐనా కలిసి పోవాలని అనుకున్నాయి. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. కిమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. ఇప్పుడు కిమ్ ప్రకటన తర్వాత రెండు దేశాలు కలవడం అసాధ్యమని తేలిపోయింది.