ఉత్తర కొరియా(North korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌(Kim Jong Un) గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటాం కదా! ఈయన తండ్రి ఇంకా మహా ఘటికుడు! ఆయన పేరు కింగ్‌ జోంగ్‌ ఇల్‌(King Jong Il). 1994 జులై నుంచి తాను చనిపోయే వరకు అంటే 2011 డిసెంబర్‌ వరకు ఉత్తర కొరియాను పాలించారు.

ఉత్తర కొరియా(North korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌(Kim Jong Un) గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటాం కదా! ఈయన తండ్రి ఇంకా మహా ఘటికుడు! ఆయన పేరు కింగ్‌ జోంగ్‌ ఇల్‌(King Jong Il). 1994 జులై నుంచి తాను చనిపోయే వరకు అంటే 2011 డిసెంబర్‌ వరకు ఉత్తర కొరియాను పాలించారు. కొడుకు కంటే పెద్ద నియంత ఆయన! ఆయన కూడా కొరియన్‌ యూత్‌పై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఉండకూడదనుకునేవారు. అందుకే విదేశీ సినిమాలను బ్యాన్‌(Movie Ban) చేశారు. బ్లూ జీన్స్‌(Blue Jeans) కూడా ధరించకూడదని శాసించాడు. కాకపోతే కిమ్‌ జోంగ్‌ ఇల్‌కు సినిమాలంటే మహా పిచ్చి.

తన దేశంలో సినిమాలు తీయడం కోసం దక్షిణకొరియాకు చెందిన ఓ ప్రముఖ నటి చోయ్‌ యున్‌ హీ(Choi Yun hee), ఆమె భర్తను కిడ్నాప్‌ చేశాడు.చోయ్‌ యున్‌ హీని అయితే రెండున్నరేళ్లు నిర్బంధించారు. ఆమెతో 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978లో జరిగింది. అది దక్షిణకొరియా సినిమాలకు గోల్డెన్‌ పీరియడ్‌. అప్పట్లో దక్షిణ కొరియాకు చెందిన చాలా సినిమాలు వచ్చేవి. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ సాంగ్‌ ఓక్‌ సినిమా దర్శకుడు.

వీరు సెలబ్రిటీ జంటగా(Celebrity couple) పేరుండేది. అయితే ఓ జూనియర్‌ నటితో షిన్ సాంగ్‌ ఓక్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పట్నుంచి భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈసమయంలో నటి చోయ్‌ యున్‌ హీ ఓ వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్‌ వెళ్లారు. అప్పుడే ఆమెను ఉత్తర కొరియా ఏజెంట్‌ కిడ్నాప్‌ చేశాడు. ఆమెను స్పీడ్‌బోట్‌లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ దగ్గరకు తీసుకెళ్లాడు. హాంకాంగ్‌లో జరిగిన వ్యాపార ఒప్పందం అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని చోయ్‌ యున్‌ హీకి అప్పుడు అర్థమయ్యింది.

అయితే తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ తపనల్లా ఉత్తర కొరియాలో రూపొందించే సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాలన్నదే! అందుకే చోయ్ యున్ హీ భర్తను కూడా తమ దేశానికి బలవంతంగా తీసుకువచ్చాడు. షిన్ సాంగ్‌ ఓక్‌ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అతడిని జైల్లో తోశారు.

అయిదేళ్ల పాటు అతడిని జైల్లోనే ఉంచారు. ఉత్తర కొరియా కోసం సినిమాలు తీయాలని ఆదేశించారు. భార్య భర్తలిద్దరూ కలిసి రెండేళ్లలో మొత్తం 17 సినిమాలు చేశారట! ఈ విషయాన్ని షిన్ సాంగ్‌ ఓక్‌(Shin Sung Ok) ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రాత్రిపూట మూడు గంటలకు మించి నిద్రపోకూడదని, నిరంతరం పని చేస్తూ ఉండాలని కిమ్‌ జోంగ్‌ ఇల్‌ ఆదేశించారట! అలాగైతేనే ప్రాణాలు నిలబడతాయని హెచ్చరించారట! 1986లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కిమ్ నటి చోయ్ యున్ హీ, దర్శకుడు షిన్ సాంగ్‌ ఓక్‌లను ఉత్తర కొరియా ప్రతినిధులుగా పంపారు. వారిద్దరికి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. గదుల్లో కూడా గార్డులను మోహరించాడు. అయితే భార్యభర్తలిద్దరూ ఎలాగోలా తప్పించుకున్నారు. అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే ఆశ్రయం పొందారు.

Updated On 13 Jan 2024 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story