Kawah Ijen Lake : ఆ సరస్సుది అంతుచిక్కని రహస్యం.. చీకటి పడిందంటే చాలు...
సైన్స్‌కు(Science) కూడా అందని వింత అది! ఎన్నో ఏళ్లుగా ఆ మిస్టరీని ఛేదించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. అది ఓ అంతుచిక్కని సరస్సు. ఆ సరస్సే ఇప్పుడు పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. వారికి నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ సరస్సులోని నీటి రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధిస్తున్నారు.
సైన్స్‌కు(Science) కూడా అందని వింత అది! ఎన్నో ఏళ్లుగా ఆ మిస్టరీని ఛేదించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. అది ఓ అంతుచిక్కని సరస్సు. ఆ సరస్సే ఇప్పుడు పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. వారికి నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ సరస్సులోని నీటి రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధిస్తున్నారు. రాత్రి కాగానే ఆ సరస్సులోని నీరు ఎందుకు నీలి రంగులోకి మారిపోతున్నదో ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. ఇండోనేషియాలో(Indonesia) ఉన్నదీ సరస్సు. ఈ ఉప్పు నీటి సరస్సు పేరు కవాహ్ ఇజేన్ లేక్(Kawah Ijen Lake). చూడటానికి ఇతర సరస్సుల్లాగే ఉంటుంది. ఉదయం వేళ ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. కాకపోతే టెంపరేచరే 200 డిగ్రీ సెల్సియస్‌పైనే ఉంటుంది. చీకటి పడుతున్న కొద్దీ సరస్సులో మార్పులు మొదలవుతాయి. అర్ధరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది.
మెరుస్తూ కనిపిస్తుంది. ఇంత వింతైన విచిత్రమైన సరస్సును చూసేందుకు పర్యాటకులు రావాలి కదా! కానీ టూరిస్టులెవరూ ఇక్కడ కనిపించు. అందుకు కారణం సరస్సులోని వేడి నీరే(Hot Water). ఆ వేడి నీరు కారణంగానే ఇక్కడికి వచ్చే వారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. అందుకే ఇక్కడికి రావడానికి జంకుతుంటారు. ఆ మాటకొస్తే సైంటిస్టుల పరిశోధనలు ముందుకు సాగకపోవడానికి కూడా ఇదే కారణం. గాఢ నీలి రంగులోకి నీరు ఎందుకు మారుతుందో తెలుసుకోవానికి వివిధ దేశాలకు చెందిన సైంటిస్టులు ప్రయత్నించారు. పరిశోధనలు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఈ రంగులు మార్చడం వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పదుల సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలుతుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయి. అగ్ని పర్వతాలు పేలడం వల్ల హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువ రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారిపోతున్నదని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు కానీ వాటికి ఆధారం లేదు. నిరంతరం వాయువులు వెలువడుతున్నప్పుడు ఉదయం పూట నీటి రంగు మారకుండా , అర్ధరాత్రి వేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదో వీరు చెప్పలేకపోతున్నారు.