Rat catching job : అక్కడ ఎలుకలు పట్టేవారికి కోటి రూపాయల జీతం!
గాడిద చాకిరీ చేయించుకుంటూ బెత్తెడు జీతం ఇస్తున్నారు.. దీనికంటే ఎలుకలు పట్టుకుని బతకడం మేలు అని కొందరనుకుంటున్నారు. ఎలుకలు పట్టుకుంటే ఏ మాత్రం వస్తుందేమిటీ? అని అడక్కండి.. చెబితే నోరెళ్లబెడతారు. ఎందుకంటే ర్యాట్ క్యాచర్స్‌కు అక్కడ జీతం అక్షరాల 1.2 కోట్ల రూపాయలు. నిజమా అని హాశ్చర్యపోకండి.. నిజమే!
గాడిద చాకిరీ చేయించుకుంటూ బెత్తెడు జీతం ఇస్తున్నారు.. దీనికంటే ఎలుకలు పట్టుకుని బతకడం మేలు అని కొందరనుకుంటున్నారు. ఎలుకలు పట్టుకుంటే ఏ మాత్రం వస్తుందేమిటీ? అని అడక్కండి.. చెబితే నోరెళ్లబెడతారు. ఎందుకంటే ర్యాట్ క్యాచర్స్‌కు అక్కడ జీతం అక్షరాల 1.2 కోట్ల రూపాయలు. నిజమా అని హాశ్చర్యపోకండి.. నిజమే! కాకపోతే ఇది అమెరికాలో(America)ని న్యూయార్క్(New York) నగరంలో. అక్కడ ఎలుకలు(Rats) నానా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇంట్లో చెక్క వస్తువులను కొరికేస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ఇతరత్రా ఆహారపదార్థాలను సర్వనాశనం చేస్తున్నాయి. ప్రజలకు చికాకు పుట్టిస్తున్నాయి. ఇలా అయితే లాభం లేదనుకున్నారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్.. వెంటనే ర్యాట్ క్యాచర్‌ను నియమించారు. డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్(Director of Rodent Mitigation) పేరుతో ఎలుకలను కంట్రోల్ చేసే ఉద్యోగానికి దరఖాస్తులు కోరారు మేయర్. ఈ ఉద్యోగానికి కూడా 900 మంది అప్లై చేసుకున్నారు. చివరకు కేథలిన్ కొరాడీ(Kathleen Corradi) అనే మహిళను ఎంపిక చేశారు. ఇంతకు ముందు ఆమె ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేశారు. అప్పుడు ఎలుకల నియంత్రణ, వాటికి, ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వగైరా అంశాలపై పరిశోధన చేశారు. ర్యాట్ క్యాచర్ ఉద్యోగి బాధ్యతలేమిటంటే ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్త ఎలుకలకు అందకుండా డిస్పోజ్ చేయడం, ఎలుకల సంతతి తగ్గేలా చర్యలు తీసుకోవడం, సబ్‌వేలలో ఎలుకల ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈ ఉద్యోగంలో కొన్ని నిబంధనలు, ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎలుకలకు ఎట్టి పరిస్థితులలో విష పదార్థాలను పెట్టకూడదు. విష ఆహారం తిని చనిపోయిన ఎలుకలను ఏదైనా జంతువులు తిని చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి!