బాక్సాఫీసును బద్దలు కొట్టి కలెక్షన్లు కుమ్మేసిన టైటానిక్‌(Titanic)చిత్రంలోని హీరోయిన్‌ కేట్‌ విన్స్‌లెట్‌(Kate Winslet)ను ఎవరు మాత్రం మర్చిపోగలరు?

బాక్సాఫీసును బద్దలు కొట్టి కలెక్షన్లు కుమ్మేసిన టైటానిక్‌(Titanic)చిత్రంలోని హీరోయిన్‌ కేట్‌ విన్స్‌లెట్‌(Kate Winslet)ను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ఆస్కార్‌ అవార్డును గెల్చుకున్న కేట్ విన్స్‌లెట్‌లో అందం ఏ మాత్రం తగ్గలేదు. అదే అందం.. అదే సోయగం. యంగ్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆమె మెరిసిపోతున్నది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లైంగిక సామర్థ్యం తగ్గిపోవడంపై చాలా విషయాలు చెప్పుకొచ్చారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం టెస్టోస్టెరాన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీని చేయించుకున్నానని అన్నారు. ముప్పయేళ్లు దాటిన వారికి సహజంగానే లైంగిక కోరికలు తగ్గిపోతుంటాయి. అందుకు కారణం హార్మోన్ల సమతుల్యత లోపించడం. మారిన జీవన శైలి కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి కారణమవుతోంది. ఈ సమస్య పురుషులకే కాదు, మహిళలకు కూడా ఉంది. అయితే ప్రస్తుత జీవన విధానంలోని లోపాల కారణంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని అధిగమించడానికి టెస్టోస్టెరాన్ థెరపీ చేయించకుంటారు. ఇది కేవలం శారరీక ఆనందం కోసమే అనుకునేరు. ఆరోగ్యపరంగానూ ఈ థెరపీ మహిళలకు అవసరం. ప్రతి ఒక్కరిలో టెస్టోస్టెరాన్‌ ఉంటుంది. అది లైంగిక హార్మోన్‌. పురుషులలో ఈ స్థాయి ఎక్కువగానే ఉంటుంది. మహిళలో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని తగ్గించడమే కాదు, ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. కండరాలు, ఎముకల పనితీరు తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. వయసు పెరిగే కొద్దీ మహిళలలో టెస్టోస్టెరాన్‌ స్థాయిలు తగ్గుతాయి. అందుకే టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(Testosterone Replacement Therapy)తీసుకుంటున్నారు చాలా మంది. ఈ థెరపీ వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎముకల సమస్య తీరుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అయితే టెస్టోస్టెరాన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. లేకపోతే ప్రమాదం.

ehatv

ehatv

Next Story