2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల(America Presidential Elections)కు నవంబర్‌లో ఓటింగ్ జరగనుంది.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల(America Presidential Elections)కు నవంబర్‌లో ఓటింగ్ జరగనుంది. ఈ నేప‌థ్యంలో అమెరికా నేతల మ‌ధ్య‌ మాటల యుద్ధం న‌డుస్తుంది. కమలా హారిస్(Kamala Harris) తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించారు. అధ్యక్ష ఎన్నికల చర్చను ఫాక్స్ న్యూస్‌(Fox News)కు తరలించాలన్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సూచనను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తిరస్కరించారు. ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) మే నెలలో రెండు చర్చలకు అంగీకరించారు.

మొదటి డిబేట్ జూన్‌లో CNNలో జరగాల్సి ఉండగా.. రెండవ డిబేట్ సెప్టెంబర్ 10న ABC న్యూస్‌లో జరగాల్సి ఉంది. అయితే ఇంతలో బిడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్(Vice President) కమలా హారిస్‌ను డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) నుండి అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు.

రిపబ్లికన్ అభ్యర్థి(Republican candidate) డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 10న జ‌రుగ‌నున్న ABC న్యూస్ డిబేట్ నుండి వైదొలిగినట్లు శనివారం ప్రకటించారు. ఈ విషయంపై హారీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ త‌ర్వాత సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్‌లో జ‌ర‌గాల్సిన చర్చలో పాల్గొనడానికి ట్రంప్ ప్రతిపాదనను కమలా హారిస్ తిరస్కరించారు. ఈ చర్చ పెన్సిల్వేనియాలో జరగాల్సి ఉంది. ముందుగా నిర్ణయించినట్టుగా సెప్టెంబర్ 10న ట్రంప్‌తో చర్చకు సిద్ధమని కమలా హారిస్ ట్విట్టర్‌లో తెలిపారు. నేను సెప్టెంబర్ 10న అక్కడ ఉంటాను. ట్రంప్ అక్కడ ఉంటారని నేను ఆశిస్తున్నాను అని పేర్కొంది.

ట్రంప్ త‌న‌కు భయపడుతున్నారు. ABC న్యూస్‌తో షెడ్యూల్ చేసిన చర్చను నివారించడానికి ఫాక్స్ న్యూస్ సహాయం అవసరమని హ‌రిస్‌ పేర్కొన్నారు. హారిస్ ప్రచారానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ మాట్లాడుతూ.. ట్రంప్ ఆటలు ఆడటం మానేసి సెప్టెంబర్ 10న చర్చలో పాల్గొనాలని.. ఇందుకోసం కోసం హారిస్ ఇప్పటికే కట్టుబడి ఉన్నార‌ని చెప్పారు.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story