Divorce Temple : పెళ్లిళ్లకు గుళ్లున్నట్టే విడాకులకో ఆలయం ఉంది! అది ఎక్కడుందో తెలుసా?
మనం బోల్డన్నీ కోరికలతో గుళ్లు గోపురాలకు వెళతాం! పరీక్ష పాసేయ్యాలా చేయమని, మంచి ఉద్యోగం దొరకాలని, చక్కటి భార్య రావాలని, అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్లాలని.. దేవుడికి దండంపెడుతూ ఇలాంటివన్నీ కోరుకుంటాం. సహజంగానే భక్తుల కోరికలు తీర్చే ఆలయాలకే ఎక్కువ రద్దీ ఉంటుంది. కానీ విడాకుల ఆలయం అంటూ ఒకటుందని మీరెప్పుడైనా విన్నారా? చూడటం అంత ఈజీ కాదులేండి.. ఎందుకంటే ఆ దేవాలయం మన దగ్గర లేదు..
మనం బోల్డన్నీ కోరికలతో గుళ్లు గోపురాలకు వెళతాం! పరీక్ష పాసేయ్యాలా చేయమని, మంచి ఉద్యోగం దొరకాలని, చక్కటి భార్య రావాలని, అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్లాలని.. దేవుడికి దండంపెడుతూ ఇలాంటివన్నీ కోరుకుంటాం. సహజంగానే భక్తుల కోరికలు తీర్చే ఆలయాలకే ఎక్కువ రద్దీ ఉంటుంది. కానీ విడాకుల ఆలయం అంటూ ఒకటుందని మీరెప్పుడైనా విన్నారా? చూడటం అంత ఈజీ కాదులేండి.. ఎందుకంటే ఆ దేవాలయం మన దగ్గర లేదు.. అది ఎక్కడుందో, స్థలపురాణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆ విడాకుల ఆలయం పేరు మాస్తుగావోకా టోకీజీ.. సుమారు ఆరు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఘనమైన సంస్కృతి సంప్రదాయాలున్నాయి. ఈ గుడిని డైవర్స్ టెంపుల్ అంటారు. అంటే విడాకుల దేవాలయం అన్నమాట! 1285లో బౌద్ద భిక్షువు కాకుసాన్ షిదో-నీ ఈ గుడిని నిర్మించారు. ప్రముఖ బౌద్ధ మందిరంగా విలసిల్లుతోన్న ఈ ఆలయంలో అప్పట్లో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ అందించేవారు. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. పురుషాహంకారం బుసలు కొడుతుండేది. మహిళలను చిన్నచూపు చూసేవారు. సమాజంలో వారికి ఎలాంటి అధికారాలను ఇచ్చేవారు కాదు. ఎన్నో సామాజిక కట్టుబాట్లను విధించేవారు. గృహ హింసకు గురయ్యేవారు. అలాంటి బాధితులంతా ప్రశాంతత కోసం ఈ గుడికి వస్తుండేవారు. అప్పట్లో వివాహబంధాలు ఎక్కువ రోజులు ఉండేవి కావు. విడాకుల తంతు జోరుగా ఉండేది. అలా భర్తతో తెగదెంపులు తీసుకున్న ఒంటరి మహిళలు ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందేవారు. అలాంటి మహిళలకు విడాకుల ధృవ పత్రాలను ఇచ్చేవారు. ఆ విధంగా వారికి స్వేచ్ఛగా ఉండే హక్కును ప్రసాదించేవారు.
మాస్తుగావోకా టోకీజీ గుడిలో ఓ సంగ్రహాలయం కూడా ఉంది. ఇందులో ఆలయ చరిత్రకు సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. ఇది బౌద్ధ మందిరం కాబట్టి ఆ మతానికి చెందిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తుంటారు.