ఓ NRI ఊపిరిపీల్చుకో..! బర్త్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్‌కు చుక్కెదురు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చుక్కెదురైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలను నిలిపి వేసిన కోర్టు. అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపి వేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్నారు. జనవరి 20న యూఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్య నిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం ఉన్నాయి. దీంతో, ట్రంప్ నిర్ణయంపై డెమెక్రాట్‌ల నేతృత్వం లోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరేగాన్ రాష్ట్రాలు కోర్టును సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని కోర్టులో వాదనలు వినిపించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో, సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ బర్త్ సిటిజన్ షిప్ రద్దు కార్య నిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు. ఇక, పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి.