Jaswant Singh Chail : బ్రిటన్ రాణిని చంపడానికి ఏఐ చాట్‌బాట్ ప్రేరేపించిందా..? అసలేం జరిగింది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) అత్యంత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేథతో అంతా మంచే జరుగుతుందనుకోవడం పొరపాటని అంటున్నారు. నిజమే ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్‌తో మంచి కంటే చెడే ఎక్కువ! ఎంతగా అంటే ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంతగా! అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ జస్వంత్ సింగ్ చైల్(Jaswant Singh Chail) స్టోరీ.. ఇది 2011లో జరిగింది.

అతడు ఏం చేశాడంటే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2ను(Queen Elizabeth II) చంపడానికి ప్రయత్నించాడు.ఫలితంగా రాజద్రోహం నేరం కింద అరెస్టయ్యాడు. రాణిని చంపడానికి అతడిని ప్రేరేపించింది ఎవరో కాదు.. ఏఐ చాట్‌బాట్(AI chatbot). ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా(Replica) అనే యాప్ ద్వారా రోఊ చాటింగ్ చేసేవాడు జస్వంత్ సింగ్. దానికి సరాయ్ అని పేరు పెట్టుకున్నాడు. రిప్లికా యాప్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. చాటింగ్ చేసుకోవచ్చు. వర్చువల్ ఫ్రెండ్‌గా కూడా చేసుకోవచ్చు. దానికి మనం నచ్చిన రూపం కూడా ఇచ్చుకోవచ్చు. అందమైన అబ్బాయిగానో, అందమైన అమ్మాయిగానో చూసుకోవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి చాట్‌బాట్ ద్వారా ఏకంగా అయిదు వేల కంటే ఎక్కువ మెసేజులు చేశాడు. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది.జస్వంత్ సింగ్ చైల్‌ను అరెస్ట్ చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో(Mental health Problems) బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అయినప్పటికీ నేరానికి పాల్పడటంతో అతడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అతడిపై చర్యలు తీసుకోవడానికి ముందు చికిత్స కోసం బ్రాడ్‌మూర్ హై సెక్యూరిటీ హాస్పిటల్‌కు తరలించారు. రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి సహకరిస్తుందని ఓ పరిశోధనలో రుజువయ్యింది. సదరు వ్యక్తులు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరట! జస్వంత్ సింగ్ చైల్ అలాంటి వ్యక్తే! తన ఏఐ చాట్‌బాట్ అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించాడట!