జపాన్‌ (Japan)ప్రధానమంత్రి ఫుమియో కిషిదాపై (Fumio Kishida) ఓ యువకుడు స్మోక్‌ బాంబు విసిరాడు. వకయామ నగరంలో ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదికకు దగ్గరలోనే బాంబు పేలడంతో అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధానమంత్రిని కవర్‌ చేసి ఆయనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ప్రదానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

జపాన్‌ (Japan)ప్రధానమంత్రి ఫుమియో కిషిదాపై (Fumio Kishida) ఓ యువకుడు స్మోక్‌ బాంబు విసిరాడు. వకయామ నగరంలో ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదికకు దగ్గరలోనే బాంబు పేలడంతో అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధానమంత్రిని కవర్‌ చేసి ఆయనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ప్రదానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. స్మోక్‌ బాంబు విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఓ యువకుడు పారిపోతున్నప్పుడు భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ప్రధాని ఫుమియో కిషిదా శనివారం వకయామలోని సైకాజకి పోర్టులో పర్యటించారు. మరికాసేపట్లో ప్రధాని ప్రసంగం చేయాల్సి ఉండగా బాంబు పేలింది. వచ్చే నెలలోనే ఆయన హిరోషిమాలో జీ-7 నాయకుల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఈ బాంబు దాడి ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. 2022 జులైలో జపాన్‌ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ ప్రధానమంత్రి షింజో అబేపై(Shinzo Abe) కూడా ఓ ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఓ కూడలి దగ్గర షింజో అబే ప్రసంగిస్తున్నప్పుడు దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఛాతీలో బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎన్నికల్లో ఆయన పార్టీనే విజయం సాధించింది. ఇప్పుడు కొత్త ప్రధాని ఫుమియో కిషిదాపైన కూడా అదే విధంగా దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Updated On 15 April 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story