Friendship Marriage : ఫ్రెండ్‌షిప్ పెళ్లిపై ఆసక్తి చూపుతోన్న జపాన్ యువత
జపాన్‌లో(Japan) యువత పెళ్లిళ్లకు(Marriage) దూరంగా ఉంటోందని మొన్ననే చెప్పుకున్నాం కదా! పెళ్లి, పిల్లలు, సంసారం ఈ జంజాటం అంతా ఎందుకనుకుంటున్నారు యువతీయువకులు. అందుకే ఫ్రెడ్‌షిప్ పెళ్లిని(Friendship Marriage) ఎంచుకుంటున్నారు. ఇప్పుడు జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది! 30 ఏళ్లు దాటిన పెళ్లికాని ప్రసాద్‌లు అక్కడ చాలా మందే ఉన్నారు. వారంతా ఫ్రెండ్‌షిప్ పెళ్లి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
జపాన్‌లో(Japan) యువత పెళ్లిళ్లకు(Marriage) దూరంగా ఉంటోందని మొన్ననే చెప్పుకున్నాం కదా! పెళ్లి, పిల్లలు, సంసారం ఈ జంజాటం అంతా ఎందుకనుకుంటున్నారు యువతీయువకులు. అందుకే ఫ్రెడ్‌షిప్ పెళ్లిని(Friendship Marriage) ఎంచుకుంటున్నారు. ఇప్పుడు జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది! 30 ఏళ్లు దాటిన పెళ్లికాని ప్రసాద్‌లు అక్కడ చాలా మందే ఉన్నారు. వారంతా ఫ్రెండ్‌షిప్ పెళ్లి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అంటే సహజీవనం అనుకునేరు. కాదు. ఫ్రెండ్‌షిప్ పెళ్లిలో ప్రేమ, సెక్స్ గట్రాలు ఏమీ ఉండవు. మొగుడు పెళ్లాల్లా కలిసి ఉంటారు తప్ప వారి మధ్య మరి ఏ రకమైన సంబధం ఉండదు. చట్టపరంగా వీరు మొడుగు పెళ్లాలే అయినప్పటికీ ప్రేమ, సెక్స్‌కు దూరంగా ఉంటారు. వీరు కలిసి జీవించవచ్చు. లేదా వేరువేరుగా కూడా ఉండవచ్చు. ఒకవేళ పిల్లలు కావాలని అనిపిస్తే కృత్రిమ గర్భధారణ పద్ధతులు పాటిస్తారు. లేకపోతే ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటారు. అన్నట్టు వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు వీరికి లభిస్తాయి. అందుకే ఫ్రెండ్‌షిప్ పెళ్లిపై అంత మోజు! పరస్పర అంగీకారం ఉన్నంత కాలం ఇద్దరూ తమకు నచ్చిన వారితో స్వేచ్ఛగా ఉండవచ్చు. జపాన్‌లో ఇలాంటి దంపతులు 12 లక్షల మందికి పైగా ఉన్నారట!