పల్లెల్లో పాడుపడిన ఇల్లులు చాలానే కనిపిస్తుంటాయి. జపాన్‌లో(Japan) కూడా ఇలా పడావ్‌ పడిన ఇల్లులు అనేకం ఉన్నాయి. ఇంచుమించు కోటి ఇళ్లున్నాయి. పాడుపబడిన ఇల్లను జపాన్‌ భాషలో అకియా(akiya) అంటారు. మనమేమో భూత్‌ బంగ్లా అంటాం! ఉండటానికి జనం లేక ఇళ్లన్నీ పాడుపడిపోతున్నాయి. జపాన్‌లో జనాభా(Population) దారుణంగా పడిపోతున్నది.

పల్లెల్లో పాడుపడిన ఇల్లులు చాలానే కనిపిస్తుంటాయి. జపాన్‌లో(Japan) కూడా ఇలా పడావ్‌ పడిన ఇల్లులు అనేకం ఉన్నాయి. ఇంచుమించు కోటి ఇళ్లున్నాయి. పాడుపబడిన ఇల్లను జపాన్‌ భాషలో అకియా(akiya) అంటారు. మనమేమో భూత్‌ బంగ్లా అంటాం! ఉండటానికి జనం లేక ఇళ్లన్నీ పాడుపడిపోతున్నాయి. జపాన్‌లో జనాభా(Population) దారుణంగా పడిపోతున్నది. యువతీయువకులు పెళ్లిళ్లు(Marriages) చేసుకోవడం లేదు. చేసుకున్న జంటలు కూడా పిల్లలను(chidren) కనేందుకు ఇష్టపడటం లేదు. అందుకే అక్కడ జనాభా తగ్గిపోతున్నది. చైనాలో(china) కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పెళ్లి చేసుకుంటే నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ఆశపెడుతున్నా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. పిల్లల్ని కంటే డబ్బులిస్తాం, సబ్సిడీలిస్తాం అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నా యూత్‌ పట్టించుకోవడం లేదు. ఎందుకో అక్కడి యువతకు పెళ్లి మీద విరక్తి పుట్టింది. బంధాలు అనుబంధాలకు దూరంగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు.

సోలో బతుకే బెటరనుకుంటున్నారు. మహా నగరాలలో, పట్టణాలలో జనం కనిపిస్తున్నారు. అలాంటి చోట్లలో ఖాళీ ఇళ్లను కొనేందుకు ముందుకొస్తున్నారు. అంత స్థోమత లేనివారు కిరాయికి తీసుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాడుపడిన ఇళ్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అసలు అటువైపు వెళ్లడమే లేదు. ఇంటిని అయితే కట్టుకుంటున్నారు కానీ అందులో ఎవరూ ఉండటం లేదు. వాటిని మెయింటైన్‌ చేసేవారు కూడా లేరు. ఇంట్లో ఎవరైనా ఉంటే శుభ్రంగా ఉంచుకుంటారు. ఉదయం వేళ, సాయం సంధ్య వేల దీపం పెట్టేవారు లేక పఢావ్‌ పడుతున్నాయి. జపాన్‌లో ఉన్న మొత్తం ఇళ్లల్లో 14 శాతం ఖాళీ అట! ఇల్లు ఉంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి అది వారసత్వంగా వస్తుంది. తాతలు కట్టిన ఇల్లు అని గర్వంగా చెప్పుకుంటారు కదా! బాధకరమైన విషయమేమింటే అక్కడ జనరేషన్స్‌ ఆగిపోతున్నాయి. ఇక్కడిలాగే అక్కడ కూడా యువత పల్లెలు వీడి పట్టణాలకు వెళ్లిపోతున్నది. బంగ్లాలు శిథిలమవుతున్నాయి. కొన్ని చోట్ల అసలు ఏ ఇల్లు ఎవరిదో కూడా తెలియడం లేదట! ఎందుకంటే అక్కడ రికార్డులు సరిగ్గా ఉండవు. పైగా జపాన్‌ పన్నుల విధానం భిన్నంగా ఉంటుంది. పాత ఇంటిని కూలగొట్టి, కొత్తగా కట్టుకోవడం కొంచెం కష్టం. దాని బదులుగా ఆ ఇంటిని అలాగే వదిలేయడం బెటరని అనుకుంటున్నారు. అమ్ముదామంటే కొనేవారు ఉండటం లేదు. మౌలిక వసతులు లేని చోట అయితే ఊళ్లకు ఊళ్లే నిర్మానుష్యం అవుతున్నాయి. జనాభాను బ్యాలెన్స్‌ చేయాలంటే కనీసం 2.1 బర్త్‌రేట్ ఉండాలి. దాని వల్ల జనాభా పెరగకపోయినా తగ్గదు. అయితే జపాన్‌లో బర్త్‌ రేట్ 1.3 మాత్రమే

Updated On 10 May 2024 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story