వెనుకటికి కుజ దోషం వున్నవారు ముందు చెట్టునో కత్తినో పెళ్లి చేసుకునేవారు. ఆ పెళ్లిని కూడా ఘనంగానే జరిపేవారు.

వెనుకటికి కుజ దోషం వున్నవారు ముందు చెట్టునో కత్తినో పెళ్లి చేసుకునేవారు. ఆ పెళ్లిని కూడా ఘనంగానే జరిపేవారు. ఓ రకంగా చెప్పాలంటే ఒంటరి పెళ్లి కిందే లెక్క. జపాన్‌లో(Japan) ఇప్పుడు ఒంటరి పెళ్లి(Alone Marriage) అనేది ట్రెండ్‌గా మారింది. యువకులు కాదు కానీ యువతులు ఈ రకమైన పెళ్లి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒంటరిపెళ్లి అంటే మరేం కాదు. తమను తామే పెళ్లి చేసుకోవడం. ట్రెడిషనల్‌ మ్యారేజ్‌ తంతును పక్కకు పెట్టేస్తున్నారు. ఈ వివాహవేడుకలో అసలు పెళ్లి కొడుకు(Groom) కనిపించడు. ఈ కొత్త రకం పెళ్లిని చాలా హంగు ఆర్భాటాలతో, వైభవంగా జరుపుకుంటున్నారు. చాలా మంది యువతులు తమ జీవితంలో ఇదో ప్రధాన ఘట్టంగా భావిస్తున్నారు. ఇలాంటి పెళ్లికి ఆద్యురాలు అడల్డ్‌ వీడియో స్టార్‌ మన సకుర. అయిదేళ్ల కిందట అంటే 2019 మార్చిలో తనను తాను పెళ్లి చేసుకుని పది మందికి గొప్పగా చెప్పుకుంది. తాను తన సొంత జీవితాన్ని గౌరవిస్తానని, ఆరోగ్యంగా ఉన్నా, వ్యాధిగ్రస్తురాలై మంచాన పడినా, తనను తాను ఎల్లవేళలా ప్రేమించుకుంటానని, తననుతాను సంతోషపరచుకుంటానని ప్రతిజ్ఞ చేసింది మన సకుర. హనవోకా అనే యువతి కూడా ఇలాగే ఒంటరి పెళ్లి చేసుకుంది. 'నన్ను నేను పెళ్లి చేసుకోవడమంటే, పురుషుల మీద ద్వేషం ఉందని కాదు. పురుషులను పెళ్లి చేసుకోకూడదని కూడా కాదు' అని ఆమె తెలిపింది. చిత్రమేమిటంటే పెళ్లయిన మహిళలు కూడా ఒంటరి పెళ్లిళ్లు చేసుకోవడం. ఇదిలా ఉంటే సంప్రదాయబద్ధమైన పెళ్లిళ్లు బాగా తగ్గాయని జపాన్‌ ప్రభుత్వమే చెబుతోంది. ఒంటరి వివాహాలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నదట! ఇంకో గమ్మత్తు ఏమిటంటే ఏకాకి పెళ్లి చేసుకునేవారు సోలోగానే హనీమూన్‌కు వెళుతుండటం!

Eha Tv

Eha Tv

Next Story