వీళ్ల బండబడ.. చివరాఖరికి పాములను కూడా వదలడం లేదు. కరకర నమిలిమింగడం కాదు.. రక్తం తాగేస్తున్నారు. మనం కాఫీలు, టీలు తాగినట్టుగా పాముల రక్తాన్ని(Snake Blood) జుర్రేస్తున్నారు. మనమేమో పాములను పూజిస్తాం.. ఎంతటి విషపుపామునైనా చంపకుండా వదిలేస్తాం. అనివార్యపరిస్థితిల్లో మాత్రమే వాటికి హానీ తలపెడతాం! కానీ ఇండోనేషియా(Indonesia) వాళ్లు మాత్రం పాము కనిపిస్తే చటుక్కుమని పట్టేసుకుని లటుక్కుమని గుటకాయస్వాహా అనేస్తారు.

వీళ్ల బండబడ.. చివరాఖరికి పాములను కూడా వదలడం లేదు. కరకర నమిలిమింగడం కాదు.. రక్తం తాగేస్తున్నారు. మనం కాఫీలు, టీలు తాగినట్టుగా పాముల రక్తాన్ని(Snake Blood) జుర్రేస్తున్నారు. మనమేమో పాములను పూజిస్తాం.. ఎంతటి విషపుపామునైనా చంపకుండా వదిలేస్తాం. అనివార్యపరిస్థితిల్లో మాత్రమే వాటికి హానీ తలపెడతాం! కానీ ఇండోనేషియా(Indonesia) వాళ్లు మాత్రం పాము కనిపిస్తే చటుక్కుమని పట్టేసుకుని లటుక్కుమని గుటకాయస్వాహా అనేస్తారు. అమ్మాయిలైతే మరీనూ! లొట్టలేసుకుంటూ కోకాకోలా తాగినట్టు పాము రక్తాన్ని తాగేస్తారు. ఎందుకుటా అంటే వాటి రక్తం తాగితే శరీరం ఫిట్‌గా అందంగా ఉంటుందట! ఎవరు చెప్పారో ఏమో కానీ వారు అలా గట్టిగా నమ్మేస్తుంటారు. పాము రక్తం కోసం షాపుల్లో రద్దీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట! మూడు రోజుల బందు తర్వాత మన వైన్‌ షాపుల దగ్గర ఎలాంటి రద్దీ ఉంటుందో అలా ఉంటుందక్కడ! ఇండోనేషియా రాజధాని జకార్తాలో(Jakartha) పాము రక్తం తాగడం అన్నది వెరీ కామన్‌! ఎక్కడా చూసినా పాము రక్తాన్ని అమ్మే షాపులే కనిపిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తుంటారుగా! ఆ వాకింగ్‌ కాగానే పాము రక్తాన్ని తప్పక తాగుతారు. జకార్తాలో పాము రక్తానికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కారణంగా అక్కడ పాపం ప్రతి రోజు వేలాది పాములను చంపేస్తున్నారు. అన్నట్టు పాము రక్తం తాగిన తర్వాత మూడు నాలుగు గంటల పాటు టీ, కాఫీలకు దూరంగా ఉండాలట! మనం ఆఫీసులో, కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు, టీలు తాగేస్తుంటాం కదా! ఆ విధంగా వారు పాము రక్తాన్ని తాగేస్తుంటారు. ఆరోగ్యం, అందం పెంచుకునేందుకే పాము రక్తాన్ని తాగుతున్నామని చెబుతుంటారు ఇండోనేషియా ప్రజలు! పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట! ఇది కొత్తగా పుట్టుకొచ్చిన సంప్రదాయమేమీ కాదని, వందల సంవత్సరాలుగా ఇలా పాము రక్తాన్ని తాగుతున్నామని అంటున్నారు. ఓన్లీ రక్తమే కాదండోయ్‌.. పామును నిమ్మకాయతో కలిసి ఉడకపెట్టి, ఆ తర్వాత చక్కగా ఫ్రై చేసుకుని మనం కురుకురే తిన్నట్టుగా కరకరమనిపిస్తారట!

Updated On 27 March 2024 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story