S. Jaishankar : అనుమతి తీసుకునే హసీనా భారత్‌కు వచ్చారు.. రాజ్యసభలో విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్‌లో(Bangladesh) కొనసాగుతున్న హింసాకాండ
బంగ్లాదేశ్‌లో(Bangladesh) కొనసాగుతున్న హింసాకాండ, షేక్ హసీనా(Shaik Haseena) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టిన తర్వాత.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jay shankar) పొరుగు దేశం గురించి పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భద్రతా అధికారులతో సమావేశం తరువాత.. షేక్ హసీనా రాజీనామా చేయాలని స్పష్టంగా నిర్ణయించుకున్నట్లు మాకు అవగాహన ఉంది. కొంత సమయం తర్వాత.. ఆమె కొంతకాలం భారతదేశంలో ఉండేందుకు అనుమతి కోరారు. నిన్న సాయంత్రం ఆమె ఢిల్లీ చేరుకున్నారని తెలిపారు. పొరుగు దేశంలో కొనసాగుతున్న హింస, అస్థిరతపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయని ఆయన అన్నారు.
మా దౌత్య మిషన్ల ద్వారా బంగ్లాదేశ్‌లోని భారతీయ సమాజంతో మేము టచ్‌లో ఉన్నామని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో దాదాపు 19,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని.. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని.. వారందరితోనూ టచ్‌లో ఉన్నామని విదేశాంగ మంత్రి తెలిపారు. చాలా మంది విద్యార్థులు జూలైలో తిరిగి వచ్చారు. మైనారిటీల స్థితిగతులకు సంబంధించి కూడా మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు.
బంగ్లాదేశ్‌తో భారత్‌కు దశాబ్దాలుగా లోతైన సంబంధాలు ఉన్నాయని.. అక్కడి పరిస్థితులు ఇక్కడ కూడా ఆందోళనకు గురిచేశాయని అన్నారు. జూన్ నుండి బంగ్లాదేశ్‌లో పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. ఆ ధోరణి ఇప్పటి వరకూ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పొరుగు దేశంలో ఏం జరిగినా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్నదే వన్ పాయింట్ ఎజెండా అని అన్నారు.