అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా అటు వైపే చూస్తుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా అటు వైపే చూస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక ఎకానమీ, అభివృద్ధి చెందిన దేశం కావడంతో అందరికీ అమెరికాపై కన్ను ఉంటుంది. ఎన్నికల సమయంలో అందరూ దాని గురించే చర్చించుకుంటారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించారు. జనవరి 20 నుంచి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అమెరికాలో కొందరికి ఆందోళన అయితే నెలకొని ఉంది. ముఖ్యమంగా డెమోక్రాట్లకు ఇది మింగుడుపడడం లేదు. ఈ ట్రంప్‌ పాలనకు దూరంగా ఉండాలని కొందరు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటాలియన్‌ ద్వీపంలో సార్డినియాలోని ఓ గ్రామం తమ జనాభాను పెంచుకునేందుకు వినూత్న రీతిలో ఆలోచించింది. తమ గ్రామానికి ఎవరైనా అమెరికన్లు వస్తే ఒక డాలర్‌కే ఇల్లు ఇస్తామని తెలిపింది. ఎన్నికల ఫలితాలతో ఆందోళనలో ఉన్న అమెరికా పౌరులకు 'ఒల్లోలై' అనే గ్రామం ఆఫర్‌ చేస్తోంది. తమ గ్రామంలో విపరీతమైన జానాభా కొరతను ఎదుర్కొంటున్నామని.. జనాభా పెంచుకునేందుకు తమ గ్రామానికి రావాలని కోరుతోంది. శిథిలావస్థలకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్‌కే విక్రయిస్తామని తెలిపింది. ఈమేరకు ఓ వెబ్‌సైట్‌ కూడా రూపొందించింది. కొత్త పాలనతో ఆందోళనలో ఉన్నవారు తమ గ్రామానికి రావొచ్చని తెలిపింది. లేదా ప్రపంచ రాజకీయాల పట్ల మీరు అలసిపోయి ఉన్నట్లయితే తమ గ్రామంలో మంచి అవకాశాలను పొందుతూ సమతుల్య జీవనశైలిని అనుభవించండంటూ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా అవకాశం ఇస్తామని కాకపోతే అమెరికన్లకు ఫాస్ట్ ట్రాక్‌ విధానం ఉంటుందని మేయర్‌ ఫ్రాన్సిస్కో కొలంబు మీడియాకు తెలిపారు.

ehatv

ehatv

Next Story