సిసిలీ(Sicily) దగ్గర సముద్రంలో బోల్తాపడిన బేజియన్‌(Belgian yacht) అనే విలాసవంతమైన సూపర్‌ యాట్‌(super yacht) సెయిల్‌బోట్‌(Sail boat) ఇటలీని దడదడలాడిస్తోంది.

సిసిలీ(Sicily) దగ్గర సముద్రంలో బోల్తాపడిన బేజియన్‌(Belgian yacht) అనే విలాసవంతమైన సూపర్‌ యాట్‌(super yacht) సెయిల్‌బోట్‌(Sail boat) ఇటలీని దడదడలాడిస్తోంది. అందులోని వాటర్‌ప్రూఫ్‌ సేఫ్‌ల్లో(Water proof safe) అత్యంత రహస్య సమాచారం ఉండటమే ఆ భయానికి కారణం. అటానమీ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు మైక్‌ లించ్‌ పార్టీ చేసుకున్న బేజియన్‌ నౌక వాటర్‌ప్రూఫ్‌ సేఫ్‌ లాకర్స్‌లో ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉందట! దీంతో నౌక శకలాలు ఉన్న ప్రదేశంలో డైవర్ల బృందంతో కూడిన అదనపు భద్రతను కల్పించాలంటూ సిసిలీని ఇటలీ కోరుతోంది. చైనా, రష్యా ప్రభుత్వాలు ఆ విలువైన సమాచారాన్ని దొంగిలించే ఛాన్స్‌ ఉందనేది ఇటలీ అనుమానం. బేజియన్‌ బోటులో వాటర్‌ టైట్‌ సేఫ్‌లలో రెండు సూపర్‌ ఎన్‌క్రిప్టెడ్‌ హార్డ్‌ డ్రైవ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో అత్యంత రహస్య సమాచారం ఉన్నట్లు కొందరు రికవరీ అధికారులు అమెరికా వార్త సంస్థ సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నౌక శకలాలు సముద్ర జలాల్లో 50 మీటర్ల అడుగున పడిఉన్నాయి. ఆగస్టులో సిసిలీ దగ్గర సముద్రంలో మునిగిపోయిన బేజియన్‌ నౌకలో ఉన్న అటాలనమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్‌ లించ్‌, మోర్గాన్‌ స్టాన్ల ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ జోనాథన్‌ బ్లూమర్‌, ఆయన భార్య, క్లిఫ్‌ఫోర్డ్‌ ఛాన్స్‌ లాయర్‌ క్రిస్‌ మోరవిలు మరణించిన సంగతి తెలిసిందే.

Eha Tv

Eha Tv

Next Story