పాతికేళ్లు నిండినా ఇంకా పెళ్లి కానివాళ్లు(Unmarried) మన దగ్గర చాలా మందే ఉంటారు. మన దేశంలో వివాహానికి(Marriage) చాలా ప్రాధాన్యత ఉంటుంది. వివాహం జరిగితేనే జీవితం పరిపూర్ణమైనట్టుగా భావించేవారు కోకొల్లలు. డెన్మార్క్‌లో(Denmark) కూడా పెళ్లికి ఇంపార్టెన్స్‌ ఇస్తారు. వివాహ ఆవశ్యకతను చాటుతూ అక్కడో విచిత్రమైన ఆచారం కూడా ఉంది. పాతికేళ్లు నిండి ఇంకా పెళ్లికాకపోతే మాత్రం అది యువకుడైనా, యువతి అయినా సరే తలమీద నీళ్లు కుమ్మరిస్తారు.

పాతికేళ్లు నిండినా ఇంకా పెళ్లి కానివాళ్లు(Unmarried) మన దగ్గర చాలా మందే ఉంటారు. మన దేశంలో వివాహానికి(Marriage) చాలా ప్రాధాన్యత ఉంటుంది. వివాహం జరిగితేనే జీవితం పరిపూర్ణమైనట్టుగా భావించేవారు కోకొల్లలు. డెన్మార్క్‌లో(Denmark) కూడా పెళ్లికి ఇంపార్టెన్స్‌ ఇస్తారు. వివాహ ఆవశ్యకతను చాటుతూ అక్కడో విచిత్రమైన ఆచారం కూడా ఉంది. పాతికేళ్లు నిండి ఇంకా పెళ్లికాకపోతే మాత్రం అది యువకుడైనా, యువతి అయినా సరే తలమీద నీళ్లు కుమ్మరిస్తారు. అభిషేకం చేసినట్టుగా చేస్తారు. ఆ తర్వాత తల నుంచి పాదాల వరకు దాల్చిన చెక్క పొడిని(Cinnamon powder) చల్లుతారు. వందల సంవత్సరాలుగా అక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆచారాన్ని మాత్రం క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ ఆచారన్ని అక్కడెవరూ వ్యతిరేకించరు. తమ మీద నీళ్లు పోయడాన్ని శిక్ష అనుకోరు.

Updated On 19 Sep 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story