హమాస్‌ మిలిటెంట్ల(Hamas, militant) ఏరివేత సాకుతో ఇజ్రాయెల్‌ అమాయకులపై దాష్టికాన్ని ప్రదర్శిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని(Israel-Hamas War) మొదలు పెట్టి నెలరోజులు దాటింది. ఈ యుద్ధంలో చనిపోయినవారిలో అత్యధికశాతం సాధారణ ప్రజలే! ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

హమాస్‌ మిలిటెంట్ల(Hamas, militant) ఏరివేత సాకుతో ఇజ్రాయెల్‌ అమాయకులపై దాష్టికాన్ని ప్రదర్శిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని(Israel-Hamas War) మొదలు పెట్టి నెలరోజులు దాటింది. ఈ యుద్ధంలో చనిపోయినవారిలో అత్యధికశాతం సాధారణ ప్రజలే! ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఖాన్‌ యూనిస్, రఫా, డెయిర్‌ అల్‌–బలా నగరాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో 4,100 మంది చిన్నారులతో పాటు 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా ప్రజలు చనిపోయారు. గాజాలో ఉన్న 23 లక్షల మందిలో 70 శాతం మందికి ఇప్పుడు నిలువ నీడ లేకుండాపోయింది. యుద్ధంలో అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. నివాసాలు మట్టిదిబ్బలుగా మారిపోయాయి. అక్కడి ప్రజలకు ఇప్పుడు ఆహారం అందడం లేదు. తాగడానికి నీళ్లు దొరకడం లేదు. రోగమొస్తే వేసుకోవడానికి మందులు లేవు. నిత్యావసర వస్తువులు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్‌ మిలిటెంట్లు మరో అయిదుగురికి విడుదల చేశారు. అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసి సుమారు 240 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గాజాలోకి పెట్రోల్, డీజిల్‌ సరఫరాకు ఇజ్రాయెల్‌ అనుమతి ఇవ్వడం లేదు. ఇంధనం లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో 15 హాస్పిటల్స్‌లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి పరిష్కారం కనుగొనడంలో ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి విఫలమవుతోంది. ఐక్యరాజ్యసమితి మాటను ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. మరోవైపు మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని అమెరికా చేసిన సూచనను కూడా ఇజ్రాయెల్‌ బేఖాతరు చేస్తోంది.

Updated On 8 Nov 2023 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story