ISRAEL Benjamin Netanyahu : కాల్పుల విరమణ పాటించేది లేదన్న ఇజ్రాయెల్
అంతర్జాతీయ సమాజం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇజ్రాయెల్(Israel) చెవికెక్కించుకోవడం లేదు. కాల్పుల విరమణ పాటించేది లేదని తెగేసి చెప్పింది. గాజాపై(Gaza) దాడులు కొనసాగిస్తామని తేల్చేసింది. కాల్పుల విరమణ ఎట్టి పరిస్థితులలో జరగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) ప్రకటించారు.
అంతర్జాతీయ సమాజం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇజ్రాయెల్(Israel) చెవికెక్కించుకోవడం లేదు. కాల్పుల విరమణ పాటించేది లేదని తెగేసి చెప్పింది. గాజాపై(Gaza) దాడులు కొనసాగిస్తామని తేల్చేసింది. కాల్పుల విరమణ ఎట్టి పరిస్థితులలో జరగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే గాజాకు సాయం అందుతుందని, లేకుంటే అక్కడ పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్య రాజ్యసమితి చేసిన హెచ్చరికలను కూడా బేఖాతరు చేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పుల విరమణ(Cease On Fire) ఉండదని, అలా చేస్తే హమాస్‌కు(Hamas) లొంగిపోవడమే అవుతుందని నెతన్యాహూ అంటున్నాడు. కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపును తాము ఉగ్రవాదానికి లొంగిపోవాలనే పిలుపుగానే భావిస్తామని, కాబట్టి అది జరగదని చెప్పాడు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుందని ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని తాము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.