ఇజ్రాయెల్‌-పాలస్తీనా(Israel-Palestine) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌(Israel)వైకి వేలాది రాకెట్లు దూసుకెళ్లాయి. పాలస్తీనా(Palestine)కు చెందిన హమాస్‌ మిలిటెంట్లు(Hamas militants) ఇజ్రాయెల్‌లోకి చొరబడి రాకెట్లను ప్రయోగించారు.ఇళ్లు, భవంతులు ధ్వంసమయ్యాయి. 50 మందికి పైగా పౌరులు చనిపోయారు.

ఇజ్రాయెల్‌-పాలస్తీనా(Israel-Palestine) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌(Israel)వైకి వేలాది రాకెట్లు దూసుకెళ్లాయి. పాలస్తీనా(Palestine)కు చెందిన హమాస్‌ మిలిటెంట్లు(Hamas militants) ఇజ్రాయెల్‌లోకి చొరబడి రాకెట్లను ప్రయోగించారు.ఇళ్లు, భవంతులు ధ్వంసమయ్యాయి. 50 మందికి పైగా పౌరులు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిదాడికి దిగింది. గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టింది. హమాస్‌ ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది. మొత్తంమీద ఇజ్రాయెల్‌- గాజా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణమైన పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్‌ సైనం ప్రకటించింది. రాకెట్‌ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్‌లో కాల్పుల శబ్దం వినబడుతోంది. మరో వీడియోలో గాజా స్ట్రిప్ సరిహద్దులో హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ట్యాంక్‌ను స్వాధీనం చేసుకొని తగలబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ఇక ఇజ్రాయిల్ దేశంలోకి ఎంత మంది ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డారనేది స్ప‌ష్టంగా తెలియ‌లేదు. ప్ర‌స్తుతం హ‌మాస్‌, ఇజ్రాయిల్‌ మ‌ధ్య కాల్పులతో భీక‌ర పోరు న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అటు సరిహద్దుపై ఇజ్రాయెల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.

Updated On 7 Oct 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story