హమాస్‌(Hamas) టార్గెట్‌గా ఇజ్రాయెల్‌(Israel) కదనానికి కాలుదువ్వుతోంది. దీన్ని అడ్డుపెట్టుకుని గాజాలో(Gaza) ఉన్న అమాయకప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. పసిపిల్లల జీవితాలను చిదిమివేస్తున్నది. గాజా స్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాది భవంతులను నేలమట్టం చేసింది. ఆసుపత్రులని కూడా చూడకుండా రాకెట్లతో దాడికి దిగుతోంది.

హమాస్‌(Hamas) టార్గెట్‌గా ఇజ్రాయెల్‌(Israel) కదనానికి కాలుదువ్వుతోంది. దీన్ని అడ్డుపెట్టుకుని గాజాలో(Gaza) ఉన్న అమాయకప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. పసిపిల్లల జీవితాలను చిదిమివేస్తున్నది. గాజా స్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాది భవంతులను నేలమట్టం చేసింది. ఆసుపత్రులని కూడా చూడకుండా రాకెట్లతో దాడికి దిగుతోంది. సరిహద్దులలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. అమెరికా అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. కాల్పుల విమరణ పాటించాలని అమెరికా మినహా ప్రపంచ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తులను ఇజ్రాయెల్‌ పట్టించుకోవడం లేదు.

నిజానికి ఇజ్రాయెల్‌ దగ్గర ఉన్న ఆయుధబలం, సైనిక బలం, అత్యాధునిక సాంకేతిక ముందు హమాస్‌ దిగదుడుపే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ ఆర్మీ(Israel Army) హమాస్‌ను ఏమీ చేయలేకపోతున్నది. హమాస్‌ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి రహస్య భూగర్భ సొరంగాలతో విస్తారమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. పది రోజుల కిందట హమాస్‌ మిలిటెంట్లు సరిహద్దులు దాటి సముద్ర, భూ, ఆకాశ మార్గాలతో పాటు ఈ సొరంగ మార్గాలనే వాడుకుని ఇజ్రాయెల్‌పై దాడికి దిగినట్టు తెలుస్తోంది. శత్రుదుర్భేధ్యమైన టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఎలా, ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతుచిక్కడం లేదు.

ఈ సొరంగాలలోనే(Tunnels) హమాస్‌ ఆయుధ(Weapons) సామగ్రి, నెట్‌వర్క్‌ అంతా ఉన్నదట! ఇజ్రాయెల్‌ బందీలను అండర్‌గ్రౌండ్‌లోనే దాచినట్లు ఆ దేశం ఆర్మీ చెబుతోంది. గాజా స్ట్రిప్‌తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్‌. ఇందుకోసం 7,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను గుర్తించే బాధ్యతలను ఎల్బిట్‌ సిస్టమ్స్, రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌కు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్‌కు క్షిపణి దాడులను అడ్డుకునే ఐరన్‌ డోమ్‌ను సమకూర్చాయి. ఐరన్‌వాల్, ఐరన్‌ స్పేడ్‌ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి.

అయితే, అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి.
గాజా స్ట్రిప్‌లో రెండు లేయర్లున్నాయి. ఒకటి సామాన్య ప్రజలది, రెండోది హమాస్‌ది. హమాస్‌ నిర్మించుకున్న ఆ రెండో లేయర్‌ ఎక్కడుందో కనిపెట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్‌ కొన్రికస్‌ తెలిపారు. అండర్‌గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలోనూ ఇజ్రాయెల్‌ చాలాసార్లు ప్రయత్నించి భంగపడింది. 2021లో గాజాపై భారీ చేపట్టిన బాంబు దాడులతో వంద కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

అయితే, తమకు అయిదువందల కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్‌ నెట్‌వర్క్‌(Under Ground Network) ఉన్నట్లు హమాస్‌ ఆ తర్వాత ప్రకటించుకుంది.అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్‌ ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్‌ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్‌ మార్గాలు, విద్యుత్‌ తదితర సౌకర్యాలను సైతం సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్లయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి.

రైల్‌ రోడ్‌ మార్గాలు, కమ్యూనికేషన్‌ గదులూ ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయని అంటున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు. సరిహద్దుల అవతల దాడులు జరిపేందుకు కూడా వీటిని ఉపయోగించుకున్నారు.

Updated On 20 Oct 2023 11:36 PM GMT
Ehatv

Ehatv

Next Story