Israel Bomb attack : రఫా నగరంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం, 35 మంది మృతి
దక్షిణ గాజాలోని(South Gaza) రఫా నగరంపై ఇజ్రాయెల్(Israel) సైన్యం బాంబుల(Bomb) వర్షం కురిపించింది. ఈ ఘటనలో 35 మందికిపైగా పాలస్తీనియన్లను చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.
దక్షిణ గాజాలోని(South Gaza) రఫా నగరంపై ఇజ్రాయెల్(Israel) సైన్యం బాంబుల(Bomb) వర్షం కురిపించింది. ఈ ఘటనలో 35 మందికిపైగా పాలస్తీనియన్లను చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. నిర్వాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబులు వేయడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. అయితే తాము రఫాపై ఎలాంటి దాడులు చేయలేదంటోంది ఇజ్రాయెల్. ఈ దాడులతో తమకు సంబంధం లేదని, రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పింది. అంతకు ముందు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు తాము ప్రతిదాడులు చేశామని హమాస్ తెలిపింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా ఇజ్రాయెల్ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు.