Gaza Hospital Attack : గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి, 500 మంది మరణం
ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ(Al Ahli) సిటీ ఆసుపత్రిపై(Hospital) ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో(Attack) ఏకంగా అయిదు వందల మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ చేసిన దారుణానికి హాస్పిటల్ పరిసర ప్రదేశాలు భయానకంగా మారాయి. ఆసుపత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ(Al Ahli) సిటీ ఆసుపత్రిపై(Hospital) ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో(Attack) ఏకంగా అయిదు వందల మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ చేసిన దారుణానికి హాస్పిటల్ పరిసర ప్రదేశాలు భయానకంగా మారాయి. ఆసుపత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమయ్యాయి.
చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రిపై జరిగిన దాడి పట్ల పాలస్తీనా(Palestine) అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్(Mohammed Abbas) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఆసుపత్రిలో మూడు వేల మంద శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.
ఇప్పటి వరకు 500 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉత్తర గాజాను తక్షణమే ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లిపోవాల్సిందిగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన రోజే దక్షిణ గాజాపై భీకర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడులలో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు మరణించారు.
పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఉత్తర గాజా నుంచి ప్రజలు తరలివెళుతున్నారు. ఇప్పటికే సగం నగరం ఖాళీ అయ్యింది. ఆసుపత్రులో రోగులు పెరుగుతున్నారు. ఆహారం, నీరు, ఔషధాలు దొరకడం లేదు. ఆకలిదప్పులతో జనం మరణించే ప్రమాదం పొంచి ఉంది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన ఇప్పటికే ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు."Written By : Senior Journalist Sreedhar"