ఇజ్రాయెల్‌(Israel) దూకుడు పెంచింది. గాజా(Gaza) నగరాన్ని సైన్యం(Military) చుట్టుముట్టుంది. హమాస్‌(Hamas) స్థావరాలను టార్గెట్‌ చేస్తూ వైమానిక దాడులను(Air strikes) తీవ్రతరం చేసింది. పెద్ద సంఖ్యలో క్షిపణులను(Missiles) ప్రయోగిస్తోంది. ఇప్పటి వరకు వందకు పైగా హమాస్‌ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లను మట్టుపెట్టామని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. గాజా సిటీలో ఇజ్రాయెల్‌ సైన్యం వీధులను జల్లెడపడుతోంది.

ఇజ్రాయెల్‌(Israel) దూకుడు పెంచింది. గాజా(Gaza) నగరాన్ని సైన్యం(Military) చుట్టుముట్టుంది. హమాస్‌(Hamas) స్థావరాలను టార్గెట్‌ చేస్తూ వైమానిక దాడులను(Air strikes) తీవ్రతరం చేసింది. పెద్ద సంఖ్యలో క్షిపణులను(Missiles) ప్రయోగిస్తోంది. ఇప్పటి వరకు వందకు పైగా హమాస్‌ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లను మట్టుపెట్టామని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. గాజా సిటీలో ఇజ్రాయెల్‌ సైన్యం వీధులను జల్లెడపడుతోంది. రోగులు, గాయపడినవారితో పాటు వేలాది మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్‌-షిఫా హాస్పిటల్‌(Al-Shifa Hospital) ఇప్పుడు రణరంగానికి వేదికగా మారింది. హాస్పిటల్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం చుట్టుముట్టింది. హమాస్‌ ప్రధాన కమాండ్‌(Command) సెంటర్‌ ఈ హాస్పిటల్‌లోనే ఉందని, మిలిటెంట్లు ఇక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్‌ తెలిపింది.

హాస్పిటల్‌ను ధ్వంసం చేసి తీరతామని ప్రకటించింది. ఆసుపత్రి చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌ సైన్యం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. అధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్ వచ్చిన మరుక్షణం హాస్పిటల్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారంటూ ఇజ్రాయెల్‌ చెబుతున్నదంతా అవావస్తమని హమాస్‌ అంటోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం కనికరం అన్నదే లేకుండా పిల్లలు, వృద్ధులు, మహిళలపైన కూడా ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో సుమారు 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో రెండున్నర వేల మంది శిథిలాల కింద ఉండిపోయారు. వారు కూడా మరణించే ఉంటారని స్థానిక అధికారులు చెబుతున్నారు.

Updated On 10 Nov 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story