ఇజ్రాయెల్‌ సైన్యం(Israel Army) ఇప్పుడు గాజాలో(Gaza) ఉన్న ఆసుపత్రులపై(Hospitals) దాడులకు దిగుతోంది. ఇప్పటికే అతి పెద్దదైన అల్‌-షిఫా హాస్పిటల్‌ను(Al-Shafi Hospitals) దిగ్బంధించిన సైన్యం తనిఖీల పేరుతో రోగుల ఉసురు తీసుకుంటోంది. హమాస్‌ ఆయుధాలు, సొరంగాల ఫోటోలు విడుదల చేస్తున్నది కానీ ఆసుపత్రుల అధ్వాన్నస్థితిని, రోగుల దయనీయ పరిస్థితిని ప్రపంచానికి తెలపడం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ సైన్యం ఉత్తర గాజాలోని(North Gaza) ఇండోనేషియన్‌ హాస్పిటల్‌ను(Indonesian Hospital) లక్ష్యంగా చేసుకుంది.

ఇజ్రాయెల్‌ సైన్యం(Israel Army) ఇప్పుడు గాజాలో(Gaza) ఉన్న ఆసుపత్రులపై(Hospitals) దాడులకు దిగుతోంది. ఇప్పటికే అతి పెద్దదైన అల్‌-షిఫా హాస్పిటల్‌ను(Al-Shifa Hospitals) దిగ్బంధించిన సైన్యం తనిఖీల పేరుతో రోగుల ఉసురు తీసుకుంటోంది. హమాస్‌ ఆయుధాలు, సొరంగాల ఫోటోలు విడుదల చేస్తున్నది కానీ ఆసుపత్రుల అధ్వాన్నస్థితిని, రోగుల దయనీయ పరిస్థితిని ప్రపంచానికి తెలపడం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ సైన్యం ఉత్తర గాజాలోని(North Gaza) ఇండోనేషియన్‌ హాస్పిటల్‌ను(Indonesian Hospital) లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో పేషంట్లు ఉన్నారు. యుద్ధం కారణంగా గాయపడిన వారు కూడా చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు వేలాది మంది పాలస్తీనియన్లు(Palestine) ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం ఇజ్రాయెల్‌ సైన్యం హఠాత్తుగా ఇండోనేషియన్‌ ఆసుపత్రిపై క్షిపణలు(Missiles) ప్రయోగించింది. ఆకస్మాత్తుగా క్షిపణులు విరుచుకుపడుతుండటంతో ఆసుపత్రిలో ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. రెండో అంతస్తు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఇజ్రాయెల్‌ దాడిలో కనీసం 12 మంది మరణించారు. ఇండోనేషియన్‌ హాస్పిటల్‌కు 200 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఆసుప్రతి చుట్టుపక్కన ఉన్న భవనాలపై ఇజ్రాయెల్‌ షార్ప్‌ షూటర్లు మాటు వేశారు. ఆసుపత్రులపై ఇజ్రాయెల్‌ వైమానికదాడులు ఉధృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రులలో హమాస్‌ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్‌ అంటోంది. ఆ మిషతో అమాయక పాలస్తీనియుల ప్రాణాలు తీస్తోంది. ఇదిలా ఉంటే అల్‌-షిఫా ఆసుపత్రి నుంచి దక్షిణ గాజాలోని అల్‌-అహ్లీ ఎమిరేట్స్‌ హాస్పిటల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరలించిన 31 మంది శిశువుల్లో 28 మంఇని సోమవారం అంబులెన్స్‌ల్లో ఈజిప్టుకు చేర్చారు. ఈజిప్టు వైద్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. శిశువుల కోసం ఇంక్యుబేటర్లు సిద్ధంగా ఉంచారు. ఈజిప్టులో వారికి మెరుగైన వైద్య చికిత్స అందించనున్నారు. శిశువుల్లో కొందరిని గాజా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని అల్‌–అరిష్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరికొందరిని కైరోకు తీసుకెళ్లారు. వీరంతా అల్‌–షిఫాలో నెలలు నిండక ముందు జన్మించి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారే.

Updated On 21 Nov 2023 1:11 AM GMT
Ehatv

Ehatv

Next Story