గాజాలోని(Gaza) అతి పెద్ద ఆసుపత్రి అల్‌-షిఫాలో(Al-Shifa) ఇప్పుడు చావు కేకలు వినిపిస్తున్నాయి. వైద్యం అందక రోగులు చనిపోతున్నారు. మృత్యశయ్యపై ఉన్న వారు చావు కోసం ఎదురుచూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతో పాటు ఏడు వేల మందికి పైగా సామాన్య పాలస్తీనియన్లు(Palestine) అదే ఆసుపత్రిలో(Hospital) ఆశ్రయం పొందుతున్నారు. అందుకే ఇజ్రాయెల్‌(Israel Military) సైన్యం ఈ హాస్పిటల్‌ను టార్గెట్ చేసింది. ఆసుపత్రిని చుట్టుముట్టింది.

గాజాలోని(Gaza) అతి పెద్ద ఆసుపత్రి అల్‌-షిఫాలో(Al-Shifa) ఇప్పుడు చావు కేకలు వినిపిస్తున్నాయి. వైద్యం అందక రోగులు చనిపోతున్నారు. మృత్యశయ్యపై ఉన్న వారు చావు కోసం ఎదురుచూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతో పాటు ఏడు వేల మందికి పైగా సామాన్య పాలస్తీనియన్లు(Palestine) అదే ఆసుపత్రిలో(Hospital) ఆశ్రయం పొందుతున్నారు. అందుకే ఇజ్రాయెల్‌(Israel Military) సైన్యం ఈ హాస్పిటల్‌ను టార్గెట్ చేసింది. ఆసుపత్రిని చుట్టుముట్టింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ అదే ఆసుపత్రిలో ఉందనే మిషతో ప్రజలకు నరకం చూపిస్తోంది. రోజూ తనిఖీలు చేస్తోంది. చాలా రోజులుగా బయట నుంచి ఆహారం, నీరు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధనం సరఫరాలను నిలిపివేసింది. విద్యుత్‌ సరఫరాను ఆపేసింది. వారం రోజుల నుంచి ఇక్కడ ట్రీట్‌మెంట్‌ జరగడం లేదు. ఐసీయూలోని రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. గురువారం రాత్రి నుంచి 22 మంది చనిపోయారని అల్‌-షిఫా డైరెక్టర్‌ మొహమ్మద్‌ అబూ సాల్‌మయా తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 50 మందికి పైగా రోగులు(Paitents) చనిపోయినట్టు సమచారం.
ఇంత జరుగుతున్నా ఇజ్రాయెల్‌ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోంది. గాజాలో భీకర దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు దక్షిణ గాజాను కూడా వదలడం లేదు. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు వెంటనే పశ్చిమ ప్రాంతానికి వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఆలస్యం చేస్తే ఎన్‌కౌంటర్‌లో చనిపోతారని బెదిరిస్తోంది. దక్షిణ గాజాలో ఉన్న నాలుగు లక్షల మంది ప్రజలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. దీనికి తోడుగా ఇటీవల ఉత్తర గాజాలో ఇజ్రాయెల్‌ నిరంతరం దాడులు జరపడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని దక్షిణ గాజాకు వచ్చారు. ఇప్పుడు వీరంతా ఉన్నపళంగా పశ్చిమ ప్రాంతానికి వెళ్లడం అసాధ్యం. తాము ప్రజల బాగు కోసమే పశ్చిమ ప్రాంతానికి వెళ్లమంటున్నామని, అక్కడైతే మానవతాసాయం పొందడానికి సులువుగా ఉంటుందని ఇజ్రాయెల్‌ అంటోంది. తీయని మాటలు చెబుతున్న ఇజ్రాయెల్‌ చేష్టలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. శరణార్థి శిబిరాలపై కూడా సైన్యం దాడులు చేస్తున్నది. లేటెస్ట్‌గా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో 18 మంది పాలస్తీనా శరణార్థులు చనిపోయారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్థి శిబిరం దగ్గరలో ఉన్న ఆసుపత్రిని కూడా ఇజ్రాయెల్ సైన్యం వదల్లేదు. ఎంత మంది చనిపోయారో తెలియదు. శనివారం తెల్లవారుజామున ఖాన్‌ యూనిస్‌ నగరంలోని ఓ ప్రాంతంపై బాంబుదాడులు జరిపింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ ఘటనలో 26 మంది మరణించారు.గాజాలో నివసిస్తున్నవారిలో అత్యధికులు ముస్లింలే! దాడుల్లో రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. భవంతులు నేలమట్టమవుతున్నాయి. శిథిలాలలో చిక్కుకుని చాలా మంది చనిపోతున్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మృతులకు వీలైనంత త్వరగా అంత్యక్రియలు జరపాలి. మృతదేహాలను సబ్బుతో శుభ్రం చేసి, కొత్త బట్టలు తొడిగి, పన్నీరు చల్లాలి. 24 గంటల్లోపు ఖననం చేయాలి. కానీ గాజాలో చాలా మంది ఈ చిట్టచివరి గౌరవానికి నోచుకోవడం లేదు.

Updated On 18 Nov 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story