కోల్‌కతాలోని ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌ (ఇస్కాన్‌) బంగ్లాదేశ్‌లోని హిందువుకు ఓ సూచన చేసింది.

కోల్‌కతాలోని ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌ (ఇస్కాన్‌) బంగ్లాదేశ్‌లోని హిందువుకు ఓ సూచన చేసింది. సూచన కాదు జాగ్రత్తలు చెప్పింది. కాషాయం ధరించకండి. తిలకం పెట్టకండి.. తులసీ జపమాలను దాచేయండి.అప్పుడే మత ఛాందసవాదుల నుంచి రక్షించుకోగలుగుతామని బంగ్లాదేశ్‌(bangladesh)లోని హిందువులకు జాగ్రత్తలు చెప్పింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు గుళ్లలో లేదా ఇళ్లలో మాత్రమే మతాచారాలను పాటించాలని, బయటకు వస్తే జాగ్రత్తగా ఉండాలని ఇస్కాన్‌ కోల్‌కతా వైస్‌ ప్రెసిడెంట్‌ రాధారమణ్‌ దాస్‌ సలహా ఇచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించవద్దని, నుదుటిపై తిలకం పెట్టుకోవద్దని రాధారమణ్‌ దాస్ (Radha ramana das)సూచించారు.

బంగ్లాదేశ్‌లోని హిందువులు బయటకు సాధువులుగా కనిపించకుండా ఉండటమే మంచిదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపైనా, ఇస్కాన్‌ సన్యాసులపైనా దాడులు జరుగుతున్నాయని, ఆధ్యాత్మిక వేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ను అరెస్ట్‌ చేశారని, న్యాయవాది రమణ్‌రాయ్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పారు.

ehatv

ehatv

Next Story