అగ్రరాజ్యం అమెరికాకు(America) మరోసారి అధ్యక్షుడవ్వాలని ఉబలాటపడుతున్న రిపబ్లికన్‌ పార్టీ(Republic party) అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ఎప్పటిలాగే నోరుపారేసుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాకు(America) మరోసారి అధ్యక్షుడవ్వాలని ఉబలాటపడుతున్న రిపబ్లికన్‌ పార్టీ(Republic party) అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ఎప్పటిలాగే నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల(Elections) సమరంలో డెమోక్రటిక్‌ పార్టీ (Democratic Party)తరఫున బరిలో నిలిచిన ఉపాధ్యక్షురాలు, ఇండియన్‌ అమెరికన్(Indian American) అభ్యర్థి కమలా హారిస్‌(Kamala Harris)పై హద్దుదాటి విమర్శ చేశారు. అసలు కమలా హారిస్‌ భారతీయురాలా? లేదా నల్లజాతీయురాలా? అని వ్యాఖ్యానించారు. తాజాగా కమలా హారిస్‌పై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ చికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్(National Association of Black Journalists) సమావేశంలో మాట్లాడారు.

'కమలా హారిస్‌ ఎప్పుడూ భారతీయ వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. దానినే ఆమె ప్రచారం చేస్తారు.అయితే ప్రస్తుతం ఆమె నల్లజాతీయురాలిగా గుర్తించబడాలని కోరుకుంటున్నారు. నాకు మాత్రం ఆమె భారతీయురాలా? లేదా నల్లజాతీయురాలా? అనే విషయం తెలిదు. నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ఆమె అలా చేయరు. ఎందుకంటే ఆమె ఒక భారతీయురాలుగా ఉండి అకస్మాత్తుగా నల్లజాతీయురాలుగా మారారు’ అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను వైట్‌ హౌస్‌(White house) తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ తన వ్యాఖ్యలతో కమలా హారిస్‌ను అవమానపరిచారని మండిపడింది. ఎదుటివాళ్ల గుర్తింపును అడిగే హక్కు ఎవరీకి లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.

ehatv

ehatv

Next Story