విహారయాత్రలకు వెళ్లేవారికి ఐఆర్‏సి‏టి‏సి గుడ్ న్యూస్ తెలిపింది. పర్యాటకులని ఆకట్టుకొనే విధంగా తక్కువ బడ్జెట్ లో విహారయాత్రల కోసం ఎన్నో ఆకర్షనీయమైన ప్యాకేజీలను అందుబాటులోనికి తీసుకువస్తూ ఉంటుంది . ఈ ప్యాకేజిల ద్వారా పర్యాటకులు చాల సులువుగా వారి హాలిడేస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్స్ ని బుక్ చేసుకోవడం దగ్గర నుండి వసతి వరకు అన్ని రకాల వివరాలని మనం సులువుగా తెలుసుకోవచ్చు.. ఇందులో భాగంగానే ఐఆర్‏సి‏టి‏సి అతి తక్కువ ధరలో థాయిలాండ్ టూర్ ప్యాకేజీ‏ని […]

విహారయాత్రలకు వెళ్లేవారికి ఐఆర్‏సి‏టి‏సి గుడ్ న్యూస్ తెలిపింది. పర్యాటకులని ఆకట్టుకొనే విధంగా తక్కువ బడ్జెట్ లో విహారయాత్రల కోసం ఎన్నో ఆకర్షనీయమైన ప్యాకేజీలను అందుబాటులోనికి తీసుకువస్తూ ఉంటుంది . ఈ ప్యాకేజిల ద్వారా పర్యాటకులు చాల సులువుగా వారి హాలిడేస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్స్ ని బుక్ చేసుకోవడం దగ్గర నుండి వసతి వరకు అన్ని రకాల వివరాలని మనం సులువుగా తెలుసుకోవచ్చు.. ఇందులో భాగంగానే ఐఆర్‏సి‏టి‏సి అతి తక్కువ ధరలో థాయిలాండ్ టూర్ ప్యాకేజీ‏ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ హాలిడే ప్యాకేజీ వివరాలు ఇపుడు తెలుసుకుందాం .

ప్రయాణం వివరాలు :
మార్చ్ 18 న ఉదయం 6. 30 గం .ల కు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో ఇండిగో విమానం లో మొదలవుతుంది . తిరుగు ప్రయాణం మార్చి 22

ఎన్ని రోజులు : 5 రోజులు
5 పగలు /4 రాత్రులు

పర్యాటక ప్రాంతాలు : బ్యాంకాక్ ,పటాయ.

మొదటి రోజు: బ్యాంకాక్ లో మధ్యాహ్నం దిగిన తర్వాత పటాయ కు వెళ్లే ముందు ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం.సాయంత్రం పటాయ లో సందర్శన . రాత్రికి హోటల్లో బస .

రెండవ రోజు : పర్యటన‏లో భాగంగా స్పీడ్ బోట్ ద్వారా కోరల్ ఐస్ ల్యాండ్స్ కు తీసుకువెళ్లటం జరుగుతుంది.అక్కడ స్కూబా డైవింగ్ ,పారగ్లైడింగ్ లాంటి బీచ్ ఆక్టివిటీస్‏ని సొంత ఖర్చులతో ఆనందించవచ్చు . లంచ్ తర్వాత సాయంత్రం పటాయ లోని పర్యటించవచ్చు .షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి హోటల్ చేరుకోవచ్చు.

మూడవ రోజు :హోటల్ నుండి చెక్ అవుట్ అయ్యి బ్యాంకాక్ కి చేరుకుంటారు. ఆ రోజు గోల్డెన్ బుద్ధ మరియు మార్బల్ బుద్ధ దేవాలయాన్ని సందర్శిస్తారు . బోజనం తరువాత రివర్ క్రుయూజ్ ను ఎంజాయ్ చేస్తారు . తిరిగి రాత్రికి బ్యాంకుకు సిటీ హోటల్ కు చేరుకుంటారు .

నాల్గవ రోజు :సఫారీ వరల్డ్ టూర్ ని మరీనా పార్క్ ని సందర్శిస్తారు . లంచ్ తరువాత సిటీ లో లోకల్ మర్కెట్స్ లో షాపింగ్ చేసే వీలుంటుంది . డిన్నర్ తర్వాత హోటల్ లో నిద్ర .

ఐదవ రోజు :చివరి రోజు అల్పాహారం తరువాత బెంగుళూరు కి మీ తిరుగు ప్రయాణం మొదలు అవుతుంది .

ఇలా ఐదు రోజుల మీ హాలిడే ప్లాన్ ని ఎంజాయ్ చేయచ్చు. ఈ ప్యాకేజీ కి సంబదించిన ధరలు విషయానికి వస్తే ఒక్క ప్రయాణికుని‏కి రూ . 55,900 /- ల కు మాత్రమే. ఇద్దరు లేక ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ప్రయాణం చేసే వారికి కేవలం ఒకరికి 47,750 రూ లకే ఈ టికెట్ ధర లభిస్తుంది .

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story