ఇజ్రాయెల్‌పై(Israel) ఇరాన్‌(Iran) కత్తులు నూరుతోంది. సమరానికి సన్నద్ధమవుతోంది. పనిలో పనిగా యుద్ధంలో జోక్యం చేసుకుంటే బాగుండదని అమెరికాకు(america) ఓ హెచ్చరిక చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌(Hamas) దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య సంబంధాలు తెగిపోయాయి.

ఇజ్రాయెల్‌పై(Israel) ఇరాన్‌(Iran) కత్తులు నూరుతోంది. సమరానికి సన్నద్ధమవుతోంది. పనిలో పనిగా యుద్ధంలో జోక్యం చేసుకుంటే బాగుండదని అమెరికాకు(america) ఓ హెచ్చరిక చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌(Hamas) దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీనికి తోడు ఈ మధ్యనే సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసినప్పట్నుంచి ఇరాన్‌ కోపంతో రగిలిపోతున్నది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి సిద్దమవుతోంది. తాము ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సంసిద్ధులవుతున్నామని, ఇందుకు అమెరికా దూరంగా ఉండాలని అగ్రరాజ్యానికి ఓ హెచ్చరిక చేసింది. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ఉచ్చులో చిక్కుకోవద్దని అమెరికాకు సూచించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సందేశం పంపింది. యుద్ధం నుంచి అమెరికా పక్కకు తప్పుకోవాలని.. అప్పుడే మీరు సురక్షితంగా ఉండగలరని హెచ్చరికతో కూడిన సూచన చేసింది. ఇరాన్‌ హెచ్చరికపై ఇప్పటివరకు అమెరికా రియాక్టవ్వలేదు. సిరియా రాజధానిలోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై జరిగిన వైమానికదాడులు ముమ్మాటికి ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ అంటోంది. ఈ ఘటనలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు మిలిటరీ కమాండర్లతోపాటు పాటు 13 మంది చనిపోయారు. మరోవైపు ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంటున్నారు. మరోవైపు ఇరాన్‌ దాడులకు దిగుతుందనే భయంతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. జీపీఎస్‌ నావిగేషన్‌ను నిలిపివేసింది. తమ సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకుంది. తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్తగా అన్నిచోట్ల బాంబు షెల్టర్‌లను తెరిచింది.

Updated On 6 April 2024 2:26 AM GMT
Ehatv

Ehatv

Next Story