Iran-Israel : ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్! ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై దాడి!
మధ్య ప్రాచ్యంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇప్పటికే బాంబుల మోతలలో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.
మధ్య ప్రాచ్యంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇప్పటికే బాంబుల మోతలలో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. హమాస్(Hamas) చీఫ్ ఇస్మాయిల్(Israel) హనియా హత్య తర్వాత అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ(shiya Islamic Terorrist Organisation) హెజ్‌బొల్లా ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించింది. ఫలితంగా మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో భయానకవాతావరణం నెలకొంది. ఎంతో మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడికి రెడీగా ఉంది. ఏ క్షణమైనా భీకర దాడులకు పాల్పడవచ్చని అంటున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలో ఆయన జీ-7 దేశాలను(G-7 Countries) హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉండేందుకు అమెరికా సైన్యం(American army) ఇప్పటికే అక్కడ అడుగుపెట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ముందు జాగ్రత్తగా ఇరాన్‌పై దాడికి సిద్ధమయ్యాడు. ఒకవేళ ఇరాన్ చేస్తే ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెతన్యాహు తెలిపారు. ఇరాన్‌కు గట్టిగా జవాబు చెప్తామని అన్నారు.