Iran Missile Attack : క్షిపణలు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas), హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్(Iran) కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం 500 క్షిపణలు(Missiles), రాకెట్లతో(Rockets) ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బాంబుల మోతతో దద్ధరిల్లింది. భవనాలు, వ్యాపార సంస్థలు బాగా దెబ్బతిన్నాయి. జులైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్పొరుషన్‌ను చంపినందుకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే దిశగా వెళుతోంది. ఇరాన్‌కు సపోర్ట్‌గా హెజ్‌బొల్లా కూడా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లోని పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది.వేలాది మందిని బాంబు షెల్టర్లకు తరలించింది. దాడులను అడ్డుకోవడానికి తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. ఇజ్రాయెల్‌పై వైమానికి దాడులకు పాల్పడుతూనే టెల్‌అవీవ్‌లో ఉగ్రవాదుల్ని రంగంలోకి దించింది ఇరాన్. టెల్‌అవీవ్‌లోని ఓ మెట్రో స్టేషన్‌లో వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్‌అవీవ్‌లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మీదిగా విమానాల రాకపోకలను రద్దు చేసుకున్నాయి.