హమాస్‌ మిలిటెంట్లు(Hamas Militants) ఆకస్మిక దాడులకు దిగుతారని ఇజ్రాయెల్‌(Israel) ఊహించలేదు. జరిగిన నష్టానికి ప్రతీకారంగా గాజాపై(Gaza) ఎదురుదాడికి దిగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధమే చేస్తోంది. హమాస్‌(Hamas) మిలిటెంట్లను రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా పెను సవాల్‌ను విసురుతోంది.

హమాస్‌ మిలిటెంట్లు(Hamas Militants) ఆకస్మిక దాడులకు దిగుతారని ఇజ్రాయెల్‌(Israel) ఊహించలేదు. జరిగిన నష్టానికి ప్రతీకారంగా గాజాపై(Gaza) ఎదురుదాడికి దిగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధమే చేస్తోంది. హమాస్‌(Hamas) మిలిటెంట్లను రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా పెను సవాల్‌ను విసురుతోంది. హమాస్‌ కంటే హిజ్బుల్లా(Hezbollah) బలం చాలా ఎక్కువ. ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన ఈ సంస్థ ఇరాన్‌ అండదండలతో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం హిజ్బుల్లా దగ్గర లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయి. ఆయుధపరంగా హిజ్బుల్లాకు ఇరాన్‌(Iran) సాయం చేస్తోంది. దీని లక్ష్యం కూడా ప్రపంచపటం నుంచి ఇజ్రాయెల్‌ను తొలగించడం, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడం. హమాస్‌ ఉగ్రదాడి తర్వాత కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపైకి ప్రయోగించింది హిజ్బుల్లా. 1980లో లెబనాన్‌లో ఏర్పడిన ఈ సంస్థ మిలటరీ పరంగానే కాదు, రాజకీయంగానూ బలంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే లక్షకు పైగా రాకెట్లు(Rocket) ఉన్నాయట! వీటితో పాటు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయట! హమాస్‌ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య కూడా ఎక్కువే! దాదాపు లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్‌ దళాలు, హిజ్బుల్లా మధ్య 1985, 2000, 2006లలో తీవ్ర ఘర్షణలు జరిగాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, ఇరాన్‌ దళాలోపాటు హిజ్బుల్లా దళాలు కూడా పాల్గొన్నాయి. అందుకే సిరియా పాలకులు తిరుగుబాట్లను సమర్థంగా ఎదుర్కోగలిగారు. 2006లో ఇజ్రాయెల్‌, హిజ్బుల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. తర్వాత రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో ఇజ్రాయెల్‌ దళాలు వెనక్కి వెళ్లాయి. ఈ యుద్ధం తర్వాత హిజ్బుల్లా తన ఆయుధ సంపత్తిని బాగా పెంచుకుంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌ సైన్యం హిజ్బుల్లాను ఎలా ఎదుర్కోగలదన్నది ఆసక్తిగా మారింది.

Updated On 14 Oct 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story