ఆపిల్‌ ఐఫోన్‌(Apple Iphone)చేతిలో ఉంటే అదో స్టేటస్‌ సింబల్‌గా ఫీలవుతుంటారు.

ఆపిల్‌ ఐఫోన్‌(Apple Iphone)చేతిలో ఉంటే అదో స్టేటస్‌ సింబల్‌గా ఫీలవుతుంటారు. ఆ ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. ఆపిల్‌ ఐ ఫోన్ కొనుక్కోవాలనుకునేవారి కోసం ఆ సంస్థ ఓ మెగా ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన ఇట్స్‌ గ్లో టైమ్ అనే ఈవెంట్‌ జరగనుంది. దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను పరిచయం చేయనుంది.ఐఫోన్ 16 ఇన్-బిల్ట్ AI,ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో వచ్చిన మొదటి ఆపిల్ డివైజ్‌. చివరిసారి WWDC 2024 సమయంలో కంపెనీ iOS 18ని పరిచయం చేసింది, ఇది AIతో రూపొందించబడింది. ఇక ఐఫోన్ 15 సిరీస్‌ కంటే ఐఫోన్‌ 16 సిరీస్‌లో అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. చాలా అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఐఫోన్‌ 16 బేస్ మోడల్‌లో మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లలో వెనుక ప్యానెల్‌లో నిలువు వరుసతో డ్యూయల్ కెమెరాలతో కొత్తగా డిజైన్‌ చేశారు. . ఈ మోడల్‌లో సన్నని బెజెల్స్,పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఐఫోన్ 16 సిరీస్‌లో మెరుగైన A18 బయోనిక్ చిప్‌సెట్ ఉంటుందట! అయితే దీన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఐఫోన్ కెమెరా చాలా చాలా స్పెషల్‌. ఐఫోన్‌ 16తో దీన్ని మరింత మెరుగ్గా మార్చాలని ఆపిల్‌ సంస్థ భావిస్తోంది. iPhone 16 ప్రో మోడల్‌లో 48-మెగాపిక్సెల్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌ఉంటుంది. .ఐఫోన్ 16లో యాక్షన్ బటన్ కూడా ఉంటుందట.

ehatv

ehatv

Next Story