కాలిఫోర్నియాలో హానిమూన్ కి వెళ్లిన ఎలిజబెత్ వెబ్‌స్టర్, అలెగ్జాండర్ బర్కిల్ అనే జంటకు ఒక వింత అనుభవం ఎదురైంది . హవాయిదీవుల్లో తమ హనీమూన్ ట్రిప్‎ని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న విధంగానే సెయిల్‌ మౌయీ టూరిజం కంపెనీ తో ప్యాకెజీ మాట్లాడుకొని వెళ్లారు . స్నార్కెలింగ్ కి వెళ్లేందుకు టూరిజం సిబ్బంది డైవింగ్ మాస్కులు, స్విమ్ ష్యూట్ లు ధరించి సముద్ర గర్భంలోనికి బోట్ సహాయం తో తీసుకు వెళ్లారు. ఈ విహారయాత్రకు మొత్తం 44 […]

కాలిఫోర్నియాలో హానిమూన్ కి వెళ్లిన ఎలిజబెత్ వెబ్‌స్టర్, అలెగ్జాండర్ బర్కిల్ అనే జంటకు ఒక వింత అనుభవం ఎదురైంది . హవాయిదీవుల్లో తమ హనీమూన్ ట్రిప్‎ని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న విధంగానే సెయిల్‌ మౌయీ టూరిజం కంపెనీ తో ప్యాకెజీ మాట్లాడుకొని వెళ్లారు . స్నార్కెలింగ్ కి వెళ్లేందుకు టూరిజం సిబ్బంది డైవింగ్ మాస్కులు, స్విమ్ ష్యూట్ లు ధరించి సముద్ర గర్భంలోనికి బోట్ సహాయం తో తీసుకు వెళ్లారు. ఈ విహారయాత్రకు మొత్తం 44 మంది పర్యటకులు రావటం జరిగింది. వారందిరిని స్నార్కెలింగ్ కి ఒకే బోట్ లో తీసుకువెళ్ళటం జరిగింది.

ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పిన సదరు కెప్టెన్.. వారు ఏ వేళకు చేరుకోవాలన్నది మాత్రం చెప్పలేదు. ఈతకొడుతూ అందంగా విహరిస్తున్న ఈ కొత్తజంటకు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవటం వల్ల బోట్ ఎక్కడుందో తెలుసుకోలేక తప్పిపోయారు. చివరకు ఒంటరిగా మిగిలిన ఆ జంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదుతూ ఈదుతూ అలసి ఎలాగోల ఒక వ్యక్తి సహాయం తో ద్వీపాన్ని చేరుకున్నారు.

దాదాపు 30 నిమిషాల వరకు సముద్రంలో ఎటు వెళ్లాలో తెలియక ప్రాణాలకు తెగించి 2 గంటల పాటు ఈత కొడుతూనే ఉన్నారు … ఆనందాన్ని మిగలాల్చీన హనీమూన్ భయబ్రాంత్రులతో గడించిందని వాపోయారు ఆ జంట. ఈ ఘటనతో తమకు రక్షణ కల్పించి తమ బాగోగులు చూడాల్సిన సదరు టూరిజం కంపెనీ నిర్లక్ష్యం గా వ్యవహరించి తమ ప్రాణాలమీదకు తీసుకువచ్చిందని ఆ కంపెనీ మీద 5 మిలియన్ల డాలర్లు దావా వేయటం జరిగింది.

Updated On 7 March 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story