Pahalgam Terror Attack : అసలు సింధు జలాల ఒప్పందం ఏంటి..!!
సింధు నది ఒప్పందం అనేది 1960లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంతకం చేయబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం.

సింధు నది ఒప్పందం అనేది 1960లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంతకం చేయబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీనిని ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో రూపొందించారు. ఈ ఒప్పందం సింధు నది(Sindhu River) వ్యవస్థలోని ఆరు నదుల నీటిని రెండు దేశాల మధ్య పంచుకోవడానికి సంబంధించింది. తూర్పు నదులు సట్లెజ్, బియాస్, రావి.. ఇవి భారతదేశం నియంత్రణలో ఉన్నాయి. భారత్ వీటి నీటిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. పశ్చిమ నదులు సింధు, జీలం(Jilam), చీనాబ్(Chinab).. ఇవి పాకిస్థాన్ నియంత్రణలో ఉన్నాయి. పాకిస్థాన్ ఈ నదుల నీటిని పాకిస్థాన్(Pakistan) ప్రధానంగా వాడుకుంటుంది, కానీ భారతదేశం కొంత నీటిని నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి, గృహ వినియోగం కోసం ఉపయోగించవచ్చు. సింధు నది మొత్తం నీటిలో దాదాపు 80% పాకిస్థాన్‌కు, 20% భారతదేశానికి కేటాయించబడింది. చర్చలు లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా పరిష్కారం చేసుకోవాలి.
భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందాన్ని 2025 ఏప్రిల్ 23న తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir)లోని పహల్గామ్(Pahalgam )లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్-పాక్ (India-Pakistan)దౌత్య సంబంధాలపై కఠిన నిర్ణయం తీసుకుంటూ ఈ ఒప్పందాన్ని నిలిపివేశారు. ఈ నదుల నీటిపై పాకిస్థాన్ వ్యవసాయం, గృహావసరాలకు ఎక్కువగా ఆధారపడుతుంది. నీటి ప్రవాహం నిలిచిపోతే పాక్‌లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాఘా-అట్టారీ సరిహద్దు మూసివేయడం, పాక్ హైకమిషన్‌కు భారత్‌ను విడిచి వెళ్లడానికి ఒక వారం సమయం ఇవ్వడం వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ ఒప్పందం నిలిపివేయడం తాత్కాలికమని, కానీ పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. ఈ చర్య పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
