బర్త్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు.

బర్త్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు. ఇది ఫిబ్రవరి 20నుంచి అమలు కానుంది. అక్కడి ఇండియన్స్ తల్లిదండ్రులు అంతకంటే ముందే పిల్లల్ని కనాలని హాస్పిటల్లో నెలలు నిండకముందే సిజేరియన్ చేయిస్తున్నారు. డెడ్​లైన్ కంటే ముందే డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ముందస్తు డెలివరీల కోసం వస్తున్న వారిలో ఎక్కువ మంది ఇండియన్లే ఉన్నారని న్యూజెర్సీకి చెందిన ఓ మెటర్నిటీ క్లినిక్ డాక్టర్ ఎస్​డీ రమా తెలిపారు. బర్త్ రైట్ సిటిజన్​షిప్‌పై ట్రంప్ ప్రకటన తర్వాత..ఈ కేసులు పెరిగాయంటున్నారు. ఏడు నెలల గర్భిణులు కూడా సిజేరియన్ చేయాలని కోరుతున్నారని తెలిపారు. రిస్క్‌ ఉంటుందని చెప్తున్నా వినడం లేదంటున్న వైద్యులు.

ehatv

ehatv

Next Story