అమెరికాలో(America) మన విద్యార్థులు(Indian students) రికార్డు సాధించారు..

అమెరికాలో(America) మన విద్యార్థులు(Indian students) రికార్డు సాధించారు.. అంతర్జాతీయ విద్యార్థులలో మనమే టాప్‌! అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులలో(International students) చాన్నాళ్లుగా చైనా(China) ప్రథమ స్థానంలో ఉండింది. ఇప్పుడు చైనాను వెనక్కినెట్టేశారు భారతీయ విద్యార్థులు. గత విద్యా సంవత్సరం అంటే 2023-2024 నాటికి 3.31 లక్షల మంది స్టూడెంట్లతో టాప్‌ ప్లేస్‌కు వచ్చేసింది.

చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు మొత్తం 11.26 లక్షల మంది ఉన్నారు. వారిలో 29 శాతం మంది భారతీయులేనని అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ రూపొందించిన ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌ పేర్కొంది. ఈ నివేదికను ఢిల్లీలో సోమవారం భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి విడుదల చేశారు. భారత్‌, చైనా తర్వాత దక్షిణ కొరియా, కెనడా, తైవాన్‌ దేశాలు నిలిచాయి. 2023-2024లో అమెరికా 11.26 లక్షల స్టూడెంట్‌ వీసాలు జారీచేసింది. రిపోర్ట్‌ ప్రకారం, 2022-23లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2,68,923 కాగా, 2023-24నాటికి 23 శాతం పెరిగి 3,31,602కు చేరుకుంది. ఇందులో మాస్టర్స్‌, పీహెచ్‌డీ చేస్తున్న వారు 1,96,567 మంది ఉన్నారని స్టాటిస్టిక్స్‌ చెబుతున్నాయి. గతంలో వీరి సంఖ్య 1.65 లక్షలు ఉండేది. అలాగే అండర్‌ గ్రాడ్యయేట్ల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరుకుంది. చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఇస్తారు. ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 41 శాతం పెరిగి 97,556కు చేరుకుందని రిపోర్ట్ తెలిపింది. అన్నట్టు అమెరికానుంచి ఇండియాకు వచ్చే స్టూడెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికాలో విదేశీ విద్యార్థులలో ఇండియా టాప్‌ ప్లేస్‌లో నిలవడం15 ఏళ్లలో ఇదే మొదటిసారి.

Eha Tv

Eha Tv

Next Story