Indian Rupee Hits 86 Against US Dollar : నేల చూపులు చూస్తున్న రూపాయి
యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్‌టైం కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూ.86.04కు దిగజారింది.
యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్‌టైం కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూ.86.04కు దిగజారింది. రూపాయి విలువ ఇంత భారీగా పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా అమెరికా డాలర్ (US Dollar) బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్‌కు డిమాండ్ అధికమవుతుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది. భారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గడానికి కారణమైంది. వృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి. దిగుమతులకు పెరిగిన ఖర్చులు, ముఖ్యంగా ముడి చమురు దేశీయ ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి.