మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అన్ని రంగాల్లోనూ వారి సత్తాను చాటుతున్నారు . పలు దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలకు మన వాళ్ళు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటన్ లాంటి దేశానికి ...భారత సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రిగా పని చేస్తున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమని భారతీయులు ప్రకటిస్తున్నారు . అమెరికా అధ్యక్ష […]

మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అన్ని రంగాల్లోనూ వారి సత్తాను చాటుతున్నారు . పలు దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలకు మన వాళ్ళు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటన్ లాంటి దేశానికి ...భారత సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రిగా పని చేస్తున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమని భారతీయులు ప్రకటిస్తున్నారు .

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి పోటీకి సై అంటున్నారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ నేత, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామి ఎన్నికల్లో తన పోటీ గురించి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత సంతతి మహిళ, రిపబ్లికన్ పార్టీ నిక్కీ హేలీ ఎన్నికల్లో పోటీపై తన మనసులో మాటను బయటపెట్టారు. అమెరికా ఆదర్శాలను పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు . ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే కాదు. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అన్నారు . నేను అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు .

భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి ఒహాయోలో 1985 ఆగస్టు 9న జన్మించారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. రామస్వామి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా రామస్వామి అభివర్ణించుకుంటారు. హార్వర్డ్‌, యేల్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. 2014లో రోవాంట్ సైన్సెస్‌ బయోటెక్ సంస్థను స్థాపించి రామస్వామి.. పలు వ్యాధులకు ఔషధాలను రూపొందించారు. ఎఫ్‌డీఏ అనుమతితో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అందుబాటులోకి తెచ్చారు. నిక్కీ హేలీ, ట్రంప్‌తోపాటు.. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్, ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్సే తదితరులు రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉండనున్నారు. తాజాగా ఆ జాబితాలో వివేక్ రామస్వామి చేరారు.

Updated On 23 Feb 2023 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story