Agastya Goel:భారత సంతతి యువకుడికి ఒలింపియాడ్‌లో బంగారు పతకం
స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ ఆశిష్ గోయెల్ కుమారుడు, భారత సంతతి యువకుడు అగస్త్య గోయెల్ ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్(Olympiad)ఇన్ఫర్మేటిక్స్‌లో తన రెండవ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ ఆశిష్ గోయెల్ కుమారుడు, భారత సంతతి యువకుడు అగస్త్య గోయెల్ ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్(Olympiad)ఇన్ఫర్మేటిక్స్‌లో తన రెండవ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రోగ్రామింగ్(Programming)పోటీగా సాధారణంగా పరిగణించబడే దానిలో గోయెల్ నాల్గవ ర్యాంక్‌ను పొందాడు. 36వ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ (IOI) ఈ ఏడాది ఈజిప్ట్(Egypt)లో జరిగింది. ప్రోగ్రామింగ్ కాంటెస్ట్‌లో అగస్త్య గోయెల్(Agastya Goel)600కి 438.97 స్కోర్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. చైనాకు చెందిన కాంగ్యాంగ్ జౌ(Kangyang Zhou) 600కి 600 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ఫర్మేటిక్స్‌లో మొత్తం 34 మంది విద్యార్థులు స్వర్ణం సాధించారు, ఇందులో 21వ ర్యాంక్‌తో భారతదేశానికి చెందిన క్షితిజ్ సోదానీ(Kshitij Sodani)ఉన్నారు. కాలిఫోర్నియా(California)కు చెందిన అగస్త్య గోయెల్‌కు ఇది రెండో బంగారు పతకం. 1990లో IIT-JEE ప్రవేశ పరీక్షలో అగ్రస్థానంలో తండ్రి ఆశిష్ గోయెల్ గెలిచారు.