Sai Varshith Kandula : ట్రక్కుతో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన తెలుగు సంతతి యువకుడు
అమెరికా అధ్యక్షుడు జోబైడన్ హత్యకు కుట్ర పన్నారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే.. ఆ హత్యకు కుట్ర చేసింది ఓ తెలుగు యువకుడని పోలీసులు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం. వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు కందుల సాయివర్షిత్.. అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటున్నాడు.

Indian-origin teen charged with threatening to kill Biden
అమెరికా అధ్యక్షుడు(America President) జోబైడన్(Joe Biden) హత్యకు కుట్ర పన్నారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే.. ఆ హత్యకు కుట్ర చేసింది ఓ తెలుగు యువకుడని పోలీసులు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం. వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు కందుల సాయివర్షిత్(Kandula Sai Varshith).. అమెరికా(America)లోని మిస్సోరి స్టేట్(Missouri State)లో ఉంటున్నాడు. అక్కడి నుంచి వాషింగ్‌టన్ డీసీ(Washington DC)కి వచ్చిన సాయి వర్షిత్.. అక్కడ ఓ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడు. ట్రక్‌తో సాయి వర్షిత్ వైట్‌హౌస్(White House)లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ట్రక్(Truck)తో ఒకటిరెండుసార్లు ఢీ కొడుతూ ముందుకెళ్లే ప్రయత్నం చేశాడని.. జో బైడెన్ హత్యకు సాయి వర్షిత్ కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో సాయి వర్షిత్.. బైడెన్ హత్యకు ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నట్లు కూడా వస్తున్నాయి. అయితే అవి ఊహాగానాలా.. లేక నిజమా అన్నది తెలియాలల్సివుంది. సాయి వర్షిత్ చర్యపై అమెరికా పోలీసులు ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసినట్లు తెలుస్తోంది. సాయి వర్షిత్ వెనుక ఎవరు ఉన్నారు.? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంబించినట్లు తెలుస్తోంది.
